జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న కంప్యూటర్ విద్యలో భాగంగా కంప్యూటర్ టీచర్ల నియామకాలకు శనివారం నిర్వహించిన ఆన్‌లైన్ కంప్యూటర్ పరీక్షకు మొదటి రోజు 728 మంది అభ్యర్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు శనివారం తెలిపారు. 1,200 మంది హాజరుకావాల్సి ఉండగా 68 శాతం అభ్యర్థులు పరీక్షలు రాశారని చెప్పారు.
కంప్యూటర్ టీచర్ల పోస్టులకు 728 మంది హాజరు
Published Sat, Sep 24 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
ఏలూరు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న కంప్యూటర్ విద్యలో భాగంగా కంప్యూటర్ టీచర్ల నియామకాలకు శనివారం నిర్వహించిన ఆన్‌లైన్ కంప్యూటర్ పరీక్షకు మొదటి రోజు 728 మంది అభ్యర్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు శనివారం తెలిపారు. 1,200 మంది హాజరుకావాల్సి ఉండగా 68 శాతం అభ్యర్థులు పరీక్షలు రాశారని చెప్పారు. రెండో రోజు ఆదివారం మరో 1,100 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ఆన్‌లైన్ కంప్యూటర్ పరీక్షను రాషీ్ట్రయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఎ) ఏవో పార్వతి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Advertisement
Advertisement