Industrial Hub
-
కొప్పర్తిపై కడుపు మంట!
సాక్షి ప్రతినిధి, కడప: వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ‘ఈనాడు’ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతోంది. సీమ ప్రగతిని తట్టుకోలేక విషం కక్కుతోంది. అయితేగియితే తమ పెట్టుబడిదారుల మానసపుత్రిక అమరావతి అభివృద్ధి చెందాలి కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఏమిటనే రీతిలో శివాలెత్తిపోతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈనాడులో ఒక కథనాన్ని వండివార్చింది. అన్ని వసతులు ఉన్న అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని యధావిధిగా రామోజీ చిందులు తొక్కారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు దేశంలో 8 కొత్త నగరాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఒక నగరాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు కోరగా ప్రభుత్వం కడప సమీపాన ఉన్న కొప్పర్తిని ఎంపిక చేసింది. కొప్పర్తి ఇప్పటికే ఇండ్రస్టియల్ హబ్‌గా భాసిల్లుతోంది. పలు కంపెనీలు ఇక్కడ తమ తయారీ యూనిట్లను సైతం ప్రారంభించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొప్పర్తిని కొత్త నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఇది తప్పన్నట్టుగా.. రాష్ట్రంలో అమరావతి తప్ప మరేదీ ఊరు కాదన్నట్టుగా ‘ఈనాడు’ కడుపు మంట’తో చెలరేగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కొత్త నగరాల ఎంపికకు అమరావతి అచ్చు గుద్దినట్టు సరిపోతుందని.. అమరావతిలో అన్ని వసతులు ఉన్నాయని యధావిధిగా తనకలవాటైన రీతిలో రామోజీ చెలరేగిపోయారు. కొప్పర్తికి అనుకూలతలు ఇవే.. ఇప్పటికే కొప్పర్తి పారిశ్రామికవాడను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. 6,914 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తోంది. అందులో రూ.750 కోట్లుతో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్‌ను నెలకొల్సింది. ఒక్క దీని పరిధిలోనే రూ.10 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. తద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి. భవిష్యత్‌లో మొత్తంగా కొప్పర్తి పరిధిలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో కొప్పర్తిలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. దీంతో కేంద్రానికి కొప్పర్తి పేరును సూచిస్తూ ప్రతిపాదనలు పంపింది. దీన్ని జీర్ణించుకోలేని ఈనాడు తనకలవాటైన యధేచ్ఛగా శివాలెత్తిపోయింది. రూ.1000 కోట్లతో కొత్త నగరం కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిరి్మంచాలనుకున్న ఒక్కో నగరానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. కొత్త నగరాలకు ఎంపిక చేసిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లు ఇస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా అధికార యంత్రాంగం కొప్పర్తిని కొత్త నగరంగా ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత, భవిష్యత్‌లో ప్రత్యక్షంగా లభించే ఉద్యోగాలు, చెన్నై, బెంగళూరు, బొంబాయి వంటి మహానగరాలకు ఉన్న కనెక్టివిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రానికి ప్రతిపాదించింది. వాస్తవం ఇదయితే.. సీఎం వైఎస్ జగన్ తన సొంత గడ్డ కోసం అమరావతిని విస్మరిస్తున్నారని ‘ఈనాడు’ తన కడుపు మంటను వెళ్లగక్కింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తమ పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉన్న అమరావతిని తప్ప మరే ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ సైతం అమరావతినే కొత్త నగరంగా ఎంపిక చేయాలని ఈనాడు పల్లవి ఎత్తుకుంది. -
ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా సిద్దిపేట: హరీశ్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో నెలకొల్పిన శిక్షణ కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతర బాధ్యత ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్ పాల్గొన్నారు. యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యచంద్ర తేజతో కలసి శంకుస్థాపన చేశారు. హరీశ్ మాట్లాడుతూ సిద్దిపేట ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా మారిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా కాళేశ్వరం ద్వారా గోదావరి నీటి వసతి వచ్చిందని తెలిపారు. త్వరలో రైల్వే సౌకర్యం రానుందని, ప్రముఖ కోకాకోలా కంపెనీ కొండపోచమ్మ సాగర్ వద్ద భారీ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పా టు చేయనుందని హరీశ్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లు వర్గల్లో రానుందన్నారు. బెజ్జంకి దాచా రం వద్ద భారీ గ్రానైట్ హబ్ వస్తుందని తెలిపారు. కాగా, పొన్నాల వద్ద నిర్మించిన ప్లైఓవర్ బ్రిడ్జిని హరీశ్ ప్రారంభించి బుల్లెట్ బండిపై బ్రిడ్జి మీదుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. -
పారిశ్రామిక హబ్‌గా వైఎస్సార్ జిల్లా.. 1.30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
సాక్షి, కడప: కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమల స్థాపన వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు పరిశ్రమలు ఇక్కడికి తరలి రాగా, మరికొన్ని కొత్త పరిశ్రమలు కొప్పర్తి కేంద్రంగా ఏర్పాటయ్యేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటుకు పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేటు లిమిటెడ్ (టెక్ప్సోపోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ) పరిశ్రమ సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.46 కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. 2050 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే సదరు కంపెనీ కొప్పర్తిలో స్థలం కోసం ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకోగా ఈ మేరకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొప్పర్తిలో 165, 167, 168 ప్లాట్ల పరిధిలో 21.17 ఎకరాల స్థలాన్ని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమకు కేటాయించింది. భవిష్యత్తులో అవసరమైతే మరికొంత స్థలాన్ని ఇచ్చేందుకు ఏపీఐఐసీ అంగీకారం తెలిపింది. దీంతో సదరు కంపెనీ కొప్పర్తిలో పరిశ్రమ పనులు మొదలు పెట్టింది. వచ్చే ఏడాదిలో గార్మెంట్ పరిశ్రమ ఉత్పత్తులు ప్రారంభించనుంది. మల్టీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏపీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొప్పర్తిలో మల్టీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇక్కడ మిక్సింగ్ ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ మార్క్‌ఫెడ్ ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. మిక్సింగ్ ప్లాంటు ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విన్నవించింది. ఈ మేరకు ఏపీ మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పటికే కొప్పర్తి పారిశ్రామిక వాడను సందర్శించారు. పారిశ్రామికవాడలోని ప్లాట్ నెంబరు 15ను కేటాయించాలని కోరగా అందుకు ఏపీఐఐసీ అంగీకారం తెలిపింది. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే జమ్మలమడుగు వద్ద స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు పులివెందులలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులో రూ. 110 కోట్లతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ లిమిటెడ్, ఇదే ప్రాంతంలో రూ. 600 కోట్లతో అపాచీ కంపెనీ లెదర్ పరిశ్రమ బూట్లు, పాదరక్షల తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల 4000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కొప్పర్తి ప్రాంతంలో జిల్లా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా రూ.1580 కోట్ల వ్యయంతో అధునాతన వసతులు కల్పిస్తూ 3167 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేశారు. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ప్రారంభించారు. దీంతో దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. బద్వేలు నియోజకవర్గంలోని కృష్ణపట్నం–బళ్లారి జాతీయ రహదారిలో గోపవరం వద్ద సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమను కంపెనీ నెలకొల్పుతోంది. రూ.1600 కోట్ల పెట్టుబడులతో 589 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. మూడు వేల మందికి ఉద్యోగాలు, 4000 మంది రైతులకు ఉపాధి లభించనుంది. మొత్తంగా జిల్లాలో వేల కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమల పరిధిలో 1.30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పారిశ్రామిక హబ్‌గా జిల్లా వైఎస్సార్ జిల్లా పారిశ్రామిక హబ్‌గా మారబోతోంది. ఇప్పటికే కొప్పర్తి, పులివెందుల, గోపవరం ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వీటన్నింటిలో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. సీఎం ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టనుంది. – రాజోలి వీరారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ సలహాదారు, కడప. -
కర్నూలును ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం
-
Kurnool: ఇండస్ట్రియల్ హబ్‌గా కర్నూలు
దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు ‘న్యాయ రాజధాని’ని ప్రకటించి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సేకరించిన భూములు, దరఖాస్తు చేసుకున్న కంపెనీలు, రిజిస్ట్రేషన్లు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తే ‘కర్నూలు’ పారిశ్రామిక కేంద్రంగా మారబోతోందనేది స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: జిల్లాలో ప్రభుత్వం ఆరు ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేస్తోంది. కర్నూలు, ఆదోని, డోన్‌తో పాటు నంద్యాలలో రెండు పార్కులు ఉన్నాయి. కర్నూలు పరిధిలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఓహెచ్ఎం) కోసం 11 గ్రామాల పరిధిలో 10,900 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించింది. ఇందులో 8,300 ఎకరాలు పట్టా, తక్కినవి డీకేటీ భూములు. హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ‘ఓహెచ్ఎం’ను నోడ్ పాయింట్’గా కేంద్రం ప్రభుత్వం 2020 ఆగస్టులో నోటిఫై చేసింది. ఇందులో ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్‌కు తొలివిడతలో 413.19 ఎకరాలు కేటాయించింది. ఈ స్టీల్ ప్లాంటు పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలో ఫేజ్–2లో మరో 600 ఎకరాలు వీరికి ఏపీఐఐసీ కేటాయించనుంది. ఇందులో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తంగడంచలో జైన్ ఇరిగేషన్‌కు 623.40 ఎకరాలు కేటాయించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ పార్క్ ఇక్కడ ఏర్పాటవుతోంది. భూముల కోసం 21 కంపెనీలు దరఖాస్తు ఓహెచ్‌ఎంలోని గుట్టపాడు క్లస్టర్లో 4,900 ఎకరాలు ఏపీఐఐసీ సేకరించింది. ఇందులో సిగాచీ ఇండస్ట్రీస్, ఆర్పీఎస్ ఇండస్ట్రీస్‌తో పాటు మారుతి – సుజుకి కూడా ఫార్మారంగంలో ప్రవేశించేందుకు భూముల కోసం ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకుంది. వీటితో పాటు మరో 5 ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటితో పాటు ప్రైమో పాలీప్యాక్ (ప్లాస్టిక్ ఇండస్ట్రీ), బాక్లహ్యాక్, ఎక్సైల్ ఇమ్యూన్ లాజిక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (వెటర్నరీ ఫార్మా) భారీ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌తో పాటు మరో 13 బడా కంపెనీలు కూడా గుట్టపాడు క్లస్టర్లో నిర్మాణాలు మొదలుపెట్టబోతున్నాయి. ఓర్వకల్లు సమీపంలో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఇండస్ట్రీ నిర్మాణ పనులు ఫార్మారంగం అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ గుట్టపాడు క్లస్టర్లో దరఖాస్తు చేసుకున్న కంపెనీలలో ఫార్మాకంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్ ఫార్మారంగానికి అనువైన వాతావరణం ఉన్న ప్రదేశాలు. హైదరాబాద్ కంటే కర్నూలులో వాతావరణ పరిస్థితులు ఫార్మా అభివృద్ధికి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో భూసమస్య ఎక్కువగా ఉండటం, అక్కడి కంటే ఇక్కడి పరిస్థితులు అనువుగా ఉండటంతో తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా కంపెనీలు కర్నూలుపై దృష్టి సారిస్తున్నాయి. ఓర్వకల్లో ఎయిర్‌పోర్టు ఉండటం, హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు కర్నూలుకు వచ్చేందుకు ఎయిర్ కనెక్టివిటీ కూడా దోహదం చేస్తుంది. ‘రెడ్’కు ఈసీ క్లియరెన్స్ వస్తే.. ఫార్మా రంగంలో రెడ్, ఆరెంజ్ అని రెండు విభాగాలు దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియ ఉంటుంది. ఆరెంజ్ కేటగిరికి ఈసీ (పర్యావరణ అనుమతి) క్లియరెన్స్ ఉంది. 4,200 ఎకరాలు ఆరెంజ్ కేటగిరీలో ఫార్మాకు భూములు కేటాయిస్తున్నారు. మరో 900 ఎకరాలు రెడ్ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఈసీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. దీనికి ఈసీ ‘గ్రీన్‌సిగ్నల్’ ఇస్తే ‘రెడ్’ విభాగంలో భారీగా ఫార్మా కంపెనీలు కర్నూలులో ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డీఆర్డీవోతో పాటు మరిన్ని సంస్థలు.. ఓహెచ్‌ఎంలో 250 ఎకరాల్లో డీఆర్డీవో ప్లాంటు నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇవి కాకుండా వంద ఎకరాల్లో ఎన్ఐసీ, మెడ్‌సిటీతో పాటు ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు నిర్మిస్తున్నారు. బ్రాహ్మణపల్లి, తంగడంచ, ఇటిక్యాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయిస్తున్నారు. బ్రాహ్మణపల్లిలో 20 యూనిట్లు, ఇటిక్యాలలో 4 యూనిట్లకు ఇప్పటికే భూములు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముచ్చుమర్రి నుంచి ఓహెచ్‌ఎంకు 56 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు తొలివిడతలో రూ.560 కోట్లు కేటాయించారు. దీనికి ఈ నెల 16న టెండర్లు పిలిచారు. ఫేజ్–2లో మరో రూ.800 కోట్లు కేటాయించనున్నారు. ఇవి కాకుండా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మౌలిక వసతులు పూర్తయి, ముచ్చుమర్రి నుంచి ఓహెచ్‌ఎంకు నీరు చేరితే భారీ సంఖ్యలో పరిశ్రమలు రానున్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు పారిశ్రామిక అభివృద్ధికి 33 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం 10,900 ఎకరాలు సేకరించాం. చాలా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. జయరాజ్, జైన్ ఇరిగేషన్ లాంటి కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించాయి. పారిశ్రామికవాడలో మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా ఫార్మారంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దరఖాస్తులు కూడా ఈరంగం నుంచే ఎక్కువగా వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో కర్నూలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. – వెంకట నారాయణమ్మ, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ, కర్నూలు -
సీమకు మేలు జరిగేలా సీఎం జగన్ అడుగులు
-
75వేల మందికి ఉద్యోగాలు
-
వైఎస్ ఆర్ ఈఎంసీ ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
Andhra Pradesh: పారిశ్రామిక విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పారిశ్రామిక విప్లవం దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక గతిని మార్చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన రెండు భారీ పారిశ్రామిక పార్కుల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సకాలంలో పారిశ్రామిక పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), 801 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లను ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్ ద్వారా రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడులు 75,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. వైఎస్సార్ ఈఎంసీ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది. గరువారం వైఎస్సార్ ఈఎంసీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. డిక్సన్ సంస్థకు తొలి దశలో అభివృద్ధి చేసిన నాలుగు షెడ్లను అందించనున్నారు. కొప్పర్తి డిక్సన్ యూనిట్లో పని చేయడానికి తీసుకున్న ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తారు. కీలక ఒప్పందాలు ► ఈఎంసీలో డిక్సన్ సంస్థ రూ.127 కోట్ల పెట్టుబడితో హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. డిక్సన్ రూ.80 కోట్ల పెట్టుబడితో ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా మరో 1,100 మందికి ఉపాధి లభించనుంది. ► వీటితో పాటు ఫాక్స్‌కాన్, డీజీకార్న్, రెసల్యూట్, ఆస్ట్రమ్ వంటి పలు సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా తైవాన్‌కు చెందిన ప్రభుత్వ రంగ ప్రమోషన్స్ ఏజెన్సీ, రష్యాకు చెందిన ఏజెన్సీ, మన దేశంలోని ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ అసోసియేషన్స్ (ఐఈఎస్ఏ)లతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ► వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో ఏర్పాటైన 18 ఫార్మా, సిమెంట్, పెయింట్స్ తయారీకి చెందిన యూనిట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ 18 యూనిట్ల ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. ► వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ యూనిట్ ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ముఖద్వారం రెండు భారీ యూనిట్లకు శంకుస్థాపన ► రెండు పారిశ్రామిక పార్కుల ప్రారంభోత్సవంతో పాటు మరో రెండు భారీ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. బద్వేల్ వద్ద రూ.956 కోట్ల పెట్టుబడితో సెంచురీ ప్లైబోర్డ్ ఇండియా లిమిటెడ్ యూనిట్ పనులకు డిసెంబర్ 23 ఉదయం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ► ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతోపాటు రైతులకు ప్రయోజనం కలగనుంది. సుమారు 22,500 ఎకరాల్లో సాగు చేసిన రూ.315 కోట్ల విలువైన యూకలిప్టస్ చెట్లను ఈ సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేయనుంది. ► పులివెందులలో రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ యూనిట్ పనులకు డిసెంబర్ 24న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2,122 మందికి ఉపాధి లభించనుండగా అందులో అత్యధికంగా మహిళలకు అవకాశం రానుంది. 23న ప్రారంభించే కంపెనీలివే.. స్వర్ణముఖి కాంక్రీట్స్, శ్రీ దుర్గా సిమెంట్స్, ఫిలెమన్ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్, అవన్ని ఆర్గానిక్స్, రాయలసీమ ఎన్విరాన్ కేర్, బీఎస్ ల్యాబొరేటరీస్, యునోటెక్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గణేష్ శానిటేషన్, ఎస్ పెయింట్స్ మాన్యుఫాక్చరర్స్, అక్షర నోట్‌బుక్ అండ్ బైండింగ్ ఇండస్ట్రీ, ఆర్డీఎల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుమిత్ర ల్యాబ్స్, మణి కెమ్ ఫార్మా, శ్రీ లక్ష్మి మేఘన ఎంటర్ప్రైజెస్, ఎస్ఎన్ఆర్ ఫార్మా, శ్రీ లక్ష్మీ బయో ఆర్గానిక్స్, ఒబ్లి ఇండస్ట్రీస్, స్టార్ పేపర్ బోర్డ్స్. -
కాకినాడ సెజ్: 'సాగర' తీరానికి భారత్‌మాల
పచ్చని చెట్లు.. తెల్లని ఇసుక తిన్నెలు.. పక్కనే సముద్రం.. ఆనుకుని సన్నటి రోడ్డు.. ఈ తీర ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా మారనుంది. ఇప్పటికే కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్‌మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే çప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్దం చేశాయి. ఈ ప్రాజెక్టు ఫలితంగా తీర ప్రాంతం పారిశ్రామిక తీరంగా రూపు మారబోతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణంతో పాటు, కాకినాడ సెజ్ భూముల వివాదానికి పరిష్కారం చూపించడంతో ఇందుకు కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పోర్టు, అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్‌హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణాలకు చర్యలు మొదలవుతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా కేంద్రానికి చేరువలోని తీరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కాకినాడ పోర్టు ఏరియాలోని హార్బర్ మాత్రమే ఇప్పటి వరకూ మత్స్యకారులకు.. వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వ చొరవతో తాజాగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మేజర్ హార్బర్ రూపుదిద్దుకోనుంది. రూ .422 కోట్ల వ్యయంతో ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (వర్చువల్ విధానంలో) శంకుస్థాపన చేయడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కొత్తపల్లి , తొండంగి, తుని మండలాల్లో సుమారు 25 గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు ఇది చేదోడు వాదోడు కానుంది. 2,500 బోట్లు నిలుపుకోడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ నిర్మాణంతో ఇక్కడి మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. పారిశ్రామిక హబ్‌గా కాకినాడ సెజ్ కాకినాడ సెజ్ సమస్యకు సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకుని పరిష్కారం చూపించడంతో సెజ్ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వడానికి ..ఆరు గ్రామాలను సెజ్‌లో విలీనం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల స్థాపన.. రైతులకు తిరిగి ఇచ్చే భూములను గుర్తిస్తున్నారు. త్వరలో సెజ్ భూముల్లో పరిశ్రమల స్థాపనకు వడివడిగా చర్యలు మొదలయ్యాయి. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద రూ.2,123 కోట్లతో పోర్టు నిర్మించనున్నారు. దీనికోసం 165 ఎకరాల భూమి సేకరించి కాకినాడ సీపోర్టు అధికారులకు అప్పగించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జిల్లాలో ఇది రెండో పోర్టు. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్నికృష్ణ, ఆర్డీఓ కాకినాడ జాతీయ రహదారి నిర్మాణం ► కాకినాడ–తుని తీరప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. ► కాకినాడ రూరల్ మండలంలో తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కసపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన ఫారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. ► నాలుగు లైన్ల రహదారికి అవసరమైన 180 ఎకరాలు సేకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ► అన్నవరం నుంచి కాకినాడ వరకు 40. 319 కిలో మీటర్ల నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్నికృష్ణ, ఆర్డీఓ కాకినాడ -
సాగర తీరానికి ‘భారత్‌మాల’
పచ్చని చెట్లు ..తెల్లని ఇసుక తిన్నెలు.. పక్కనే సముద్రం.. ఆనుకుని సన్నటి రోడ్డు.. ఈ తీరం ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా మారనుంది. ఇప్పటికే కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్‌మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. ఈ ప్రాజెక్టు ఫలితంగా తీర ప్రాంతం పారిశ్రామికంగా రూపు మారబోతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణంతో పాటు, కాకినాడ సెజ్ భూముల వివాదానికి పరిష్కారం చూపించడంతో ఇందుకు కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పోర్టు, అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్‌హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణాలకు చర్యలు మొదలవుతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. పిఠాపురం: జిల్లా కేంద్రానికి చేరువలోని తీరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కాకినాడ పోర్టు ఏరియాలోని హార్బర్ మాత్రమే ఇప్పటి వరకూ మత్స్యకారులకు.. వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వ చొరవతో తాజాగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మేజర్ హార్బర్ రూపుదిద్దుకోనుంది. రూ .422 కోట్ల వ్యయంతో ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (వర్చువల్ విధానంలో) శంకుస్థాపన చేయడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కొత్తపల్లి , తొండంగి, తుని మండలాల్లో సుమారు 25 గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు ఇది చేదోడు వాదోడు కానుంది. 2,500 బోట్లు నిలుపుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ నిర్మాణంతో ఇక్కడి మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. జాతీయ రహదారి నిర్మాణం కాకినాడ–తుని తీర ప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. కాకినాడ రూరల్ మండలంలో తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కసపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన పారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. నాలుగు లైన్ల రహదారికి అవసరమైన 180 ఎకరాలు సేకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు 40.319 కిలో మీటర్ల నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. పారిశ్రామిక హబ్‌గా కాకినాడ సెజ్ కాకినాడ సెజ్ సమస్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని పరిష్కారం చూపించడంతో సెజ్ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వడానికి.. ఆరు గ్రామాలను సెజ్‌లో విలీనం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల స్థాపన.. రైతులకు తిరిగి ఇచ్చే భూములను గుర్తిస్తున్నారు. త్వరలో సెజ్ భూముల్లో పరిశ్రమల స్థాపనకు వడివడిగా చర్యలు మొదలయ్యాయి. తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద రూ.2,123 కోట్లతో పోర్టు నిర్మించనున్నారు. దీనికోసం 165 ఎకరాల భూమి సేకరించి కాకినాడ సీపోర్టు అధికారులకు ఇప్పటికే అప్పగించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా మన జిల్లాలో ఇది రెండో పోర్టు. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్ని కృష్ణ, ఆర్డీఓ కాకినాడ చదవండి: ప్రేమను గెలిపించిన పిడకల సమరం పిల్లకు పాలు.. తల్లికి కూల్ డ్రింక్ -
ఇండస్ట్రియల్ హబ్‌గా దొనకొండ
సాక్షి, దొనకొండ: జిల్లా వాసులను ఊరిస్తున్న ఇండస్ట్రియల్ హబ్ కల నెరవేరనుంది. ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను పిలిచి వివరాలు సేకరించిన సీఎం వైఎస్ జగన్ పూర్తి సమాచారంతో మరోసారి రావాలంటూ ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలోని దొనకొండ, కురిచేడు మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు చేయడం మినహా ఒక్క అడుకూడా ముందుకు వేయని పరిస్థితి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలల కూడా గడవక ముందే జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు అయితే పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందడంతోపాటు జిల్లా రూపు రేఖలే మారిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పరిశ్రమలు నిర్మించేందుకు అణువైన రోడ్డు, రైలు మార్గాలు, సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌లకు ఎంత దూరంలో ఉంది, విద్యుత్ సౌకర్యం, భౌగోళిక స్వరూపం వంటì పూర్తి వివరాలు సేకరించేందుకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం సాయంత్రం దొనకొండ, కుర్చేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. నిరుద్యోగులకు వరం.. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం వైఎస్ జగన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనుకున్న ప్రకారం దొనకొండలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు జరిగితే యువతకు ఉద్యోగాలకు కొదువే ఉండదు. నిరుద్యోగ సమస్య దాదాపుగా తగ్గిపోతుందనే చెప్పవచ్చు. కలెక్టర్ పరిశీలన.. కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం సాయంత్రం దొనకొండ మండలంలో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన రుద్రసముద్రం, రాగమక్కపల్లి, భూమనపల్లి, కొచ్చెర్లకోట, పోచమక్కపల్లి, ఇండ్లచెరువు, బాదాపురం రెవెన్యూ గ్రామాల్లోని భూములు పరిశీలించారు. లైసెన్స్ సర్వేయర్ సీహెచ్ వెంకట్రావు హబ్‌కు సంబంధించిన ప్రాంతంలోని మ్యాపు గురించి వివరించారు. ఏపీఐఐసీ వారికి సుమారు 25 వేల ఎకరాలు రెవెన్యూ వారు తయారు చేయటం జరిగిందన్నారు. 2490 ఎకరాలు ఏపీఐఐసీ వారికి అప్పగించారు. అందులో టైటాన్ ఏవియేషన్ విమానాల విడిభాగాల పరికరాల కేంద్రానికి 6 వేల ఎకరాలు, కార్ల సామాగ్రి శక్తి సామర్థ్యం కేంద్రానికి 2300 ఎకరాలు, ప్రైడ్ ప్రాజెక్టు గృహ నిర్మాణాలు, ఇంటర్నల్ వస్తు విభాగాల నిర్మాణ సంస్థకు 5 వేల ఎకరాలు, విదేశీయులు చూసి వెళ్లటం జరిగిందన్నారు. మండల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, విద్యుత్, రవాణా గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దొనకొండ నుంచి మార్కాపురానికి రూట్, వాటి మధ్య దూరం, దొనకొండ 6 వే రోడ్డు, కర్నూలు, గుంటూరు, కనిగిరి జంక్షన్ ఎన్ని కిమీ ఉంటుందనే వివరాలు మ్యాపు ద్వారా తెలుసుకున్నారు. మండల పరిధిలో రైల్వే ట్రాకులు ఎంత విస్తీర్ణంలో వెళ్తుంది. ట్రాకు వెలుపల, బయట ఉన్న గ్రామాలు గురించి క్షుణ్ణంగా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దొనకొండ రావటం జరిగిందని, ఎప్పుడైనా ప్రభుత్వం హబ్ గురించి అడిగితే తాము చెప్పటానికి ఈ ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. ఆయన వెంట జేసీ ఎస్.షన్మోహన్, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ నరసింహారావు, సర్వేయర్ అసిస్టెండ్ డైరెక్టర్ జయరాజు, తహసీల్దార్ పాలడుగు మరియమ్మ, సర్వేయరు కె.దర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
సమీక్షలతో సరి!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, జూపాడుబంగ్లాలోని అల్ట్రా మెగా ఫుడ్ ప్రాజెక్టులకు నీటి వసతి కల్పిస్తామన్న ప్రభుత్వం సమీక్షలతోనే సరిపెడుతోంది. దీంతో జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు హామీ మాటలకే పరిమితమవుతోంది. ఓర్వకల్, మిడుతూరు, గడివేముల, జూపాడుబంగ్లా మండలాల్లో పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. ఓర్వకల్‌లోని మెగా ఇండస్ట్రియల్ హబ్, జూపాడుబంగ్లాలోని అల్ట్రా మెగా ఫుడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చేయాలని నిర్ణయించినా మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దీంతో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. వీడియో కాన్ఫరెన్స్‌లు,సమీక్షలతో మమ.. మెగా ఇండస్ట్రియల్ హబ్, అల్ట్రా మెగా ఫుడ్ పార్కులకు స్థానికంగా నీటి వసతి లేకపోవడంతో సమీపంలోని ముచ్చుమర్రి నుంచి నీళ్లను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల క్రితం రూ.452 కోట్లతో 1.45 టీఎంసీ నీటిని తీసుకురావాలని అంచనా వేశారు. ఈ మేరకు ముచ్చుమర్రి నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టి ఓర్వకల్, జూపాడుబంగ్లా మండలాల్లో మినీ ప్రాజెక్టులు చేపట్టి నీటిని నింపాలని భావించారు. అయితే ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన, వీడియో కాన్ఫరెన్స్, సమీక్షల్లో మాత్రం ఇండస్ట్రియల్ హబ్‌కు నీటి వసతిపై మాట్లాడుతున్నా ఇంతవరకు కనీసం డీపీఆర్ రూపొందించలేదు. ముందుకు రాని పారిశ్రమిక వేత్తలు.. పరిశ్రమల స్థాపనకు అతిముఖ్యమైనది నీటి వసతి. అయితే ఇక్కడ నీటి సమస్య ఉండడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమ స్థాపనకు జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే వచ్చింది. అలాగే ఫుడ్ పార్కులో గుజరాత్ అంబుజా, జైన్ ఇరిగేషన్ ఫుడ్ పార్కులకు భూములు కేటాయించారు. ఇందులో మౌలిక వసతులు లేవని గుజరాత్ అంబుజా తన యూనిట్‌ను నెలకొల్పేందుకు ఆసక్తిని చూపడడంతో దానికి కేటాయించిన భూములను ఇటీవల ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1.45 టీఎంసీల నీటి కోసం అంచనా ముచ్చుమర్రి నుంచి ఇండస్ట్రియల్ హబ్, ఫుడ్‌పార్కులకు 1.45 టీఎంసీ నీటిని తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.452 కోట్లతో అంచనా వేశాం. డీపీఆర్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోయే అవకాశం ఉంది. – రఘునాథరెడ్డి, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ -
ఇండస్ట్రియల్ హబ్‌గా రేణికుంట
అల్గునూర్(మానకొండూర్): తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. గ్రామంలోని 19ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 2016 టీఎస్ ఐపాస్‌కు కేటాయించినట్లు తెలిపారు. ఈ çస్థలాన్ని గురువారం పరిశీలించి మాట్లాడాడు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. ఇందు లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు. టీఎస్ ఐపాస్‌లో భాగంగా పరిశ్రమలు నెలకొల్పేవారికి రేణికుంటలో స్థలం కేటాయిస్తున్నామన్నారు. 19 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మిస్తామని తెలిపారు. అనంతరం అల్గునూరులోని ఎస్సారెస్పీ స్థలాన్ని సందర్శించారు. దీంట్లో నర్సరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం తిమ్మాపుర్లోని మోడల్ స్కూల్ స్థలాన్ని సందర్శించారు. పాఠశాల ప్రహరీ వివాదాన్ని పరిష్కరించారు. -
అంబుజా అవుట్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు పదే పదే చెబుతున్నా ..వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో మూడేళ్లు గడిచినా ఎలాంటి మౌలిక వసతులు కల్పించడలేదు. పైగా పరిశ్రమల స్థాపన కోసం వచ్చే యాజమాన్యాలపై స్థానిక టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతుండడంతో వచ్చినవి కూడా వెనక్కి పోతున్నాయి. గుజరాత్ అంబుజా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. లక్ష్యమిదీ.. కర్నూలు జల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తానని 2014 ఆగస్టు స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అందులో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు, మిడ్తూరు మండలాల్లోని 13 వేల ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ పార్కు, జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో 833 ఎకరాల్లో అల్ట్రా మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటు బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కు అప్పగించారు. అనుకన్నదే తడువుగా 2015 ఆగస్టు 17వ తేదీన ఓర్వకల్లు సమీపంలో మెగా ఇండస్ట్రీయల్ పార్కుకు, తంగడంచెలో అల్ట్రా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అప్పటికప్పుడు గుజరాత్ అంబుజా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు 200 ఎకరాల భూమిని కేటాయించి ఆరు నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యం నిర్ణయించారు. ఎకరం రూ.5 లక్షల ప్రకారం కొనుగోలుకు కంపెనీ, ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. జిల్లాలో అధిక సంఖ్యలో రైతులు మొక్కజొన్న సాగు చేస్తారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రోత్సహించేందుకు గుజరాత్ అంబుజా కంపెనీ ముందుకు వచ్చింది. తరువాత తంగడంచెలోనే జైన్ ఇరిగేషన్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్‌కు సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అడ్డంకులు ఇవీ.. తంగడంచెలోని అల్ట్రా మెగా ఫుడ్ పార్కులో మౌలిక వసతుల కల్పన ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ విఫలమైంది. దాదాపు మూడేళ్లు గడిచినా అక్కడ ఒక్క రహదారి వేయలేదు. మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేదు. కరెంట్ వసతిని కల్పించలేదు. రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. అనుసంధాన రహదారుల మాటే ఎత్తడంలేదు. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనపై గుజరాత్ అంబుజా పరిశ్రమ నోరు మొదిపినట్లు చెబుతున్నారు. మౌలిక వసతుల కల్పనపై అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అంతేకాక స్థానికంగా కొందరు టీడీపీ నాయకులు కంపెనీపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ స్థాపించిన అనుకున్న లాభంలేదని యాజమాన్యం భావించింది. అన్నీ వసతులు ఉన్న తెలంగాణలో యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నాలుగేళ్లు గడిచినా.. ఓర్వకల్లు, మిడ్తూరు మండలాల్లో 13 వేల ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ హబ్‌లో మౌలిక వసతుల కల్పనే పెద్ద సమస్యగా మారింది. నాలుగేళ్లు గడుస్తున్నా మాస్టర్ ప్లాన్ పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క జైరాజ్ ఇస్పాత్ స్టీలు ప్రైవేట్ లిమిటెడ్‌కు మాత్రమే 415 ఎకరాలను కేటాయించారు. తరువాత ఒక్కరూ కూడా పరిశ్రమల నెలకొల్పేందుకు ముందుకు రావడంలేదు. ప్రభుత్వ వాదన ఇదీ.. గుజరాత్ అంబుజా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. యూనిట్‌కు కేటాయించిన 200 ఎకరాల భూమికి సంబంధించిన డబ్బులను చెల్లించడంలో(ఎకరం రూ.5 లక్షలు) విధించిన గడువు ముగియడంతో వెనక్కి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ కార్యదర్శి సోల్మన్ అరోక్య రాజ్ భూముల ఒప్పందాన్ని రద్దుచేస్తూ జీవో నంబర్ 31ని రెండు రోజుల క్రితం విడుదల చేశారు. అయితే కంపెనీ అడిగిన మౌలిక వసతులు, స్థానిక టీడీపీ నాయకుల బెదిరింపులపై మాత్రం మౌనం వహించడం గమనార్హం. -
పరిశ్రమలకే దారేశారు!
- చెన్నై–బెంగుళూరు కారిడార్‌లో ఓర్వకల్‌కు చోటు - నోడ్ పాయింట్‌గా ఇండస్ట్రీయల్ హబ్‌కు గుర్తింపు - పరిశ్రమల రాకకు మరింత ఊతం - పెరగనున్న రోడ్డు రవాణా సదుపాయాలు - రైతుల భూముల విలువ పెరిగే అవకాశం కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): చెన్నై–బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను నోడ్ పాయింట్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇది కరువు సీమలో పరిశ్రమల స్థాపనకు మరింతగా ఊతం ఇవ్వనున్నదని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేకిన్ ఇండియాలో భాగంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బెంగళూరు–చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌కు శ్రీకారం చుట్టారు. కారిడార్ వెంబడి పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అనేక రాయితీలను కల్పిస్తున్నారు. పరిశ్రమలకు ముడి సరుకు తేవడానికి, ఉత్పత్తి అయిన మాల్‌ను తరలించడానికి చెన్నై–బెంగళూరును కలుపుతూ నాలుగు, ఆరు లేన్ల జాతీయ రహదారులను నిర్మిస్తారు. పరిశ్రమలకు అనుగుణంగా కొత్త రైల్వే మార్గాల నిర్మాణాలను చేపడుతారు. అంతేకాక కారిడార్ వెంబడి విద్యుత్, నీటి వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను చైన్నై–బెంగళూరు కారిడార్‌లో నోడ్ పాయింట్‌గా గుర్తించారు. నోడ్ పాయింట్ అంటే.. ఆ కారిడార్‌లో భాగంగా పరిగణిస్తారు. పరిశ్రమల స్థాపనకు మరింత ఊతం: ఓర్వకల్‌ను మెగా ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓర్వకల్ సమీపంలో 7214 ఎకరాలను సేకరించింది. మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీకి అప్పగించింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీయల్ హబ్‌కు చెన్నై–బెంగళూరు కారిడార్‌లో చోటు లభించడంపై మంచి పరిణామమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. పరిశ్రమలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో సాధారణంగా రైతుల భూములకు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. -
జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుదాం
– బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పిలుపు – వ్యవసాయానికి విరివిగా రుణాలు ఇవ్వాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాను పారిశ్రామికహబ్‌గా అభివద్ధి చేసేందుకు బ్యాంకర్లు అన్ని విధాలా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌లో హాలులో శుక్రవారం నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అక్టోబర్ రెండో పక్షంలో అన్ని మండల కార్యాలయాల్లో పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడుతూ ఖరీఫ్‌లో రూ. 2790 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ. 2300 కోట్లు మాత్రమే పంపిణీ చేశారన్నారు. రబీ సీజన్ కూడా ప్రారంభమవుతున్న దష్ట్యా పంట రుణాల పంపిణీని ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు అన్ని బ్యాంకులు వెంటనే రుణ మంజూరు పత్రాలు ఇస్తే యూనిట్ల గ్రౌండింగ్‌కు అవకాశం ఉంటుందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆర్బీఐ అధికారి గణేష్, లీడీసీఎం నరసింహారావు, సిండికేట్ బ్యాంకు ఏజీఓం మహంతి, నాబార్డు డీడీఎం నగేష్‌కుమార్, ఎస్బీఐ, ఏపీజీబీ ఆర్ఎంలు రమేష్‌కుమార్, వీసీకే ప్రసాద్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే పెద్ద పారిశ్రామిక హబ్‌గా హైదరాబాద్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కొత్తూరు: దేశంలోనే పెద్ద పారిశ్రామిక హబ్‌గా హైదరాబాద్ నగరం ఆవిర్భవిస్తుందని పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రకటిం చారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం లో ఉన్న ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) ప్లాంటులో గురువారం ఇండియా ప్లానింగ్ సర్వీస్ సెంటర్‌ను ఆయన ఆ పరిశ్రమ సీఈఓ అల్ ర జ్వానీతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇక్కడ త్వరలో మరిన్ని లాజిస్టిక్స్ హబ్స్, డ్రైపోర్టులు ఏర్పాటవుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో మరెన్నో పరిశ్రమలను నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. వారికి అనుభవజ్ఞులైన కార్మికులను అందించడానికి ప్రభుత్వం వృత్తినైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. పీఅండ్‌జీ ఇండియా సీఈఓ అల్ రజ్వానీ మాట్లాడుతూ భవిష్యత్‌లో తమ ప్లాంటును మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటి ంచారు. -
పట్టణాలకు రియల్టీ పట్టం!
♦ పారిశ్రామిక హబ్‌లుగా షాద్‌నగర్, కొత్తూరు ♦ ప్రాజెక్ట్‌లు, వెంచర్లతో స్థిరాస్తి సంస్థల పరుగులు ♦ ఐదేళ్ల క్రితం ఎకరం రూ.10 లక్షలు.. ఇప్పుడు రూ.50 లక్షలకు పైమాటే ♦ రాబోయే రోజుల్లో 30 శాతం వరకూ ధరలు పెరిగే అవకాశం ♦ పెట్టుబడికి ఇదే సరైన సమయమంటున్న నిపుణులు ♦ నీళ్లు.. ఎత్తు నుంచి పల్లానికి ఎలాగైతే ప్రవహిస్తాయో.. అభివృద్ధి కూడా అంతే! అంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటూ స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉన్న ప్రాంతాల వైపే అభివృద్ధి సాగుతుందని దానర్థం. దీన్ని స్థిరాస్తి భాషలో చెప్పాలంటే మేకింగ్ ఆఫ్ షిఫ్ట్‌గా పరిగణిస్తారు. అంటే భాగ్యనగరంలో రియల్ బూమ్ బంజారాహిల్స్‌తో మొదలై.. జూబ్లిహిల్స్ నుంచి మాదాపూర్‌కు, ఆ తర్వాత గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు ఎలాగైతే పరుగులు పెట్టిందో.. ఇప్పుడు ఇదే బూమ్ షాద్‌నగర్, కొత్తూరుల వైపు మళ్లింది. సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్, కొత్తూరు మండలాలు మహబూబ్‌నగర్ పరిధిలోకి వస్తాయి. షాద్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ పరిధిలో ఫలూక్నగర్, కొత్తూరు, కొందుర్గ్, కేశంపేట ప్రాంతాలొస్తాయి. వీటిలో పారిశ్రామికంగా పేరుగాంచినవి షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాలే. 2011 లెక్కల ప్రకారం పాలమూరులో మొత్తం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు 10,770 ఉన్నాయి. వీటిలో సుమారు 75 పరిశ్రమలు భారీ పరిశ్రమలే. వీటిల్లో సుమారు 30 వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఐదేళ్లుగా 26 కొత్త పరిశ్రమలు ఇక్కడికొచ్చాయి. వీటిలో ఫుడ్ అండ్ ఆగ్రో, పవర్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్, ఫార్మా రంగాలకు చెందినవి ఉన్నాయి. ఇందులో చాలా వరకు పరిశ్రమలు కొత్తూరు, షాద్‌నగర్ ప్రాంతాల్లో కొలువుదీరినవే ఎక్కువ. ‘‘ఈ రెండు ప్రాంతాల్లో సుమారు లక్ష ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని.. వీటిలో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు రానున్నాయని వీటి ద్వారా సుమారు లక్ష వరకు ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయని’’ స్పేస్ విజన్ ఎడిఫైస్ ప్రై.లి. సీఎండీ టీవీ నర్సింహారెడ్డి సాక్షి రియల్టీకి చెప్పారు. ♦ హైదరాబాద్ నుంచి 48 కి.మీ., శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యం నుంచి 22 కి.మీ. దూరంలో ఉందీ షాద్‌నగర్. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలుపుకెళ్లే జాతీయ రహదారి-44 షాద్‌నగర్ మీదుగానే వెళుతుంది కూడా. నగరం చుట్టూ ఉన్న ఓఆర్ఆర్తో నగరానికి, మెట్రోతో నగరమంతా సులువుగా, సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండటంతో కార్యాలయాలకు దగ్గర్లోనే నివాసముండేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. నగరానికి దూరంగా ఉంటుండటంతో రణగొణ ధ్వనులకు, ట్రాఫిక్ సమస్యలకు దూరంగా పచ్చని ప్రకృతిలో జీవించొచ్చనేది వీరి అభిప్రాయం. విద్యా, వినోదం కూడా.. అంతర్జాతీయ విశ్వవిద్యాలయమైన సింబయాసిస్, టాటా వర్సిటీ వంటివి కొత్తూరులోనే ఉన్నాయి. మరో నాలుగు వేద విశ్వవిద్యాలయాలూ ఉన్నాయిక్కడ. ఈ మార్గంలో బయోకన్జర్వేషన్ జోన్ కింద 20 కి.మీ. పరిధి ఉండటంతో ఆ తర్వాత ఉన్న ప్రాంతం పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంది. భూగర్భ జల వనరులకూ కొదవేలేదిక్కడ. ఇక్కడ 650 ఎంసీఎం వరకు నీరు అందుబాటులో ఉందని ది సెంట్రల్ గ్రౌండ్ బోర్డ్ లెక్కలే చెబుతున్నాయి. ప్రస్తుతం బహదూర్‌పల్లిలోని జూ పార్క్.. షాద్‌నగర్ నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న కమ్మాదనం రిజర్వ్ ఫారెస్ట్‌కు తరలనుంది. ఇది 824 ఎకరాల్లో విస్తరించి ఉంది. వెజిటెబుల్ క్లస్టర్ బాల్నగర్, షాద్‌నగర్‌లో ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎకరం రూ.50 లక్షల పైమాటే.. ప్రస్తుతం షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాల్లో డీఎల్ఎఫ్, స్పేస్ విజన్ వంటి సంస్థలు ప్రాజెక్ట్‌లు, వెంచర్లను చేస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ధర ఎకరానికి రూ.10-15 లక్షలుండేది. కానీ, ఇప్పుడు రూ.60 లక్షల పైచిలుకు చేరింది. మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వెళితే రూ.40 లక్షల్లోపూ దొరుకుతున్నాయి. ఇక ఫ్లాట్ల ధరలు చూస్తే.. చ.అ. ధర రూ.2,000 నుంచి ప్రారంభమవుతున్నాయని’’ నర్సింహారెడ్డి చెప్పారు. టీఎస్-ఐపాస్, ఐటీ పాలసీలతో మరిన్ని పరిశ్రమలిక్కడి రానున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఏటా 25-30 శాతం రేట్లు పెరగొచ్చని అంచనా వేశారాయన. షాద్‌నగర్, కొత్తూరులోని కొన్ని కంపెనీలు ♦ కొత్తూరులో ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్‌జీ) టైడ్, ఏరియల్ సబ్బుల తయారీ యూనిట్‌ను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఇక్కడ రూ.900 కోట్లతో తమ కంపెనీని ఏర్పాటు చేసింది. విస్తరణలో భాగంగా మూడేళ్లలో సుమారు రూ.3 వేల కోట్లతో అతిపెద్ద సబ్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో సుమారు 2,000 మందికి ఉపాధి రానుంది. ♦ కొత్తూరులో జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు 47 ఎకరాల్లో రూ.400 కోట్లతో ఏర్పాటు చేశారు. డైపర్స్, సబ్బులు, బేబీ నూనెలు, షాంపులతో పాటు మెడికల్ ఉత్పత్తులు ఇక్కడ తయారు కానున్నాయి. అదనంగా మరో 4 వేల కోట్లతో 40 ఎకరాల్లో ప్లాంటును విస్తరిస్తామని కంపెనీ చెబుతోంది. దీంతో అదనంగా మరో రెండు వేలమందికి ఉపాధి లభించనుంది. ♦ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటు ఫార్మాసిటీలో ఏర్పాటు కానుంది. సుమారు 12 వేల ఎకరాల భూమి కేటాయింపు కూడా జరిగిందని సమాచారం. ♦ నగరంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ), అమ్యూజ్మెంట్ పార్క్, జూపార్క్ లు షాద్‌నగర్‌లోని బాలానగర్‌కు తరలనున్నాయి. ♦ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్తూరులో 2.80 లక్షల చ.అ.ల్లో భారీ గిడ్డంగిని ఏర్పాటు చేసింది. సుమారు 500 మందికి ఉపాధి కల్పిస్తుంది. -
పారిశ్రామిక హబ్‌లో హౌసింగ్ కాంప్లెక్స్
ఉద్యోగుల సౌకర్యార్థం ఏపీఐఐసీ నిర్ణయం 2వేల ఎకరాల్లో ఇంటి నిర్మాణాలు కలెక్టర్ చొరవతో మొదటిసారిగా ఓర్వకల్లులో ఏర్పాటు సాక్షి ప్రతినిధి, కర్నూలు: పనిచేసే చోటనే నివాసం.. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది సర్వసాధారణం. అయితే, ఇక మీదట జిల్లాలో ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇది సాధ్యం కానుంది. ఫ్యాక్టరీకి సమీపంలోనే ఉండే ఇంటిలో నివసించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లాలోని ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక హబ్‌లో.... రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) 2 వేల ఎకరాలను ప్రత్యేకంగా ఇంటి నిర్మాణాల కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రయాణం కోసం గంటల సమయం వృథా కాకుండా ఉండటంతో పాటు పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కూడా సౌకర్యంగా ఉండనుంది. ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం ఓర్వకల్లు వద్ద సుమారు 30 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్‌ను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఇప్పటికే పలు పరిశ్రమలకు కూడా భూమి కేటాయింపులు జరిగాయి. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 2 వేల ఎకరాలు కేటాయించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. తద్వారా ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా అక్కడనే ఇళ్లను నిర్మించనున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేవలం ఓర్వకల్లులోనే కాకుండా తంగెడంచె, జూపాడు బంగ్లాలో కూడా ఏర్పాటయ్యే పరిశ్రమలల్లో పనిచేసే వారికి ఈ సౌకర్యం కల్పించనున్నారు. పారిశ్రామిక హబ్‌లో హౌసింగ్ కాంప్లెక్స్ కూడా ఉండాల్సిందేనని ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడి... ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌లో భాగం చేసే విధంగాా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. -
కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్
కర్నూలు : కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిపరిచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ విజయమోహన్‌తో కలిసి గురువారం ఏపీఎస్పీ క్యాంప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సారిగా కర్నూలులో జాతీయజెండా ఎగురవేయడం సంతోషకర విషయమన్నారు. కర్నూలుకు ఏదో ఒక మంచి ప్రాజెక్టు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో సంపూర్ణమైన ముడి సరుకు, పుష్కలంగా నీరు, విస్తారమైన ప్రభుత్వ భూమి ఉన్నందున పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. హెదరాబాద్ స్థాయిలో కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. మన ప్రాంతంలో ప్రస్తుతం సిమెంటు కర్మాగారాలు, పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటివి మరిన్ని ఏర్పాటుకు విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. కర్నూలు నగరంలో ఆటో నగర్, భారీ వాహనాల పార్కి ంగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయింపునకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజధాని ఏర్పాటు కోసం కర్నూలుతో పాటు అనేక ప్రాంతాల నుంచి డిమాండ్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్మాణం జరుగుతుందన్నారు. చెన్నై-ముంబయి వంటి ప్రాంతాలు ఒక మూలకు ఉన్నప్పటికీ అవి రాజధానిగా చలామణి అవుతున్నాయని కేఈ చెప్పారు.