దేశంలోనే పెద్ద పారిశ్రామిక హబ్గా హైదరాబాద్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
కొత్తూరు: దేశంలోనే పెద్ద పారిశ్రామిక హబ్గా హైదరాబాద్ నగరం ఆవిర్భవిస్తుందని పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రకటిం చారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం లో ఉన్న ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) ప్లాంటులో గురువారం ఇండియా ప్లానింగ్ సర్వీస్ సెంటర్‌ను ఆయన ఆ పరిశ్రమ సీఈఓ అల్ ర జ్వానీతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇక్కడ త్వరలో మరిన్ని లాజిస్టిక్స్ హబ్స్, డ్రైపోర్టులు ఏర్పాటవుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో మరెన్నో పరిశ్రమలను నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. వారికి అనుభవజ్ఞులైన కార్మికులను అందించడానికి ప్రభుత్వం వృత్తినైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. పీఅండ్‌జీ ఇండియా సీఈఓ అల్ రజ్వానీ మాట్లాడుతూ భవిష్యత్‌లో తమ ప్లాంటును మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటి ంచారు.