సాక్షి ప్రతినిధి, కడప: వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ‘ఈనాడు’ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతోంది. సీమ ప్రగతిని తట్టుకోలేక విషం కక్కుతోంది. అయితేగియితే తమ పెట్టుబడిదారుల మానసపుత్రిక అమరావతి అభివృద్ధి చెందాలి కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఏమిటనే రీతిలో శివాలెత్తిపోతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈనాడులో ఒక కథనాన్ని వండివార్చింది. అన్ని వసతులు ఉన్న అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని యధావిధిగా రామోజీ చిందులు తొక్కారు.
15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు దేశంలో 8 కొత్త నగరాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఒక నగరాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు కోరగా ప్రభుత్వం కడప సమీపాన ఉన్న కొప్పర్తిని ఎంపిక చేసింది. కొప్పర్తి ఇప్పటికే ఇండ్రస్టియల్ హబ్‌గా భాసిల్లుతోంది. పలు కంపెనీలు ఇక్కడ తమ తయారీ యూనిట్లను సైతం ప్రారంభించాయి.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొప్పర్తిని కొత్త నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఇది తప్పన్నట్టుగా.. రాష్ట్రంలో అమరావతి తప్ప మరేదీ ఊరు కాదన్నట్టుగా ‘ఈనాడు’ కడుపు మంట’తో చెలరేగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కొత్త నగరాల ఎంపికకు అమరావతి అచ్చు గుద్దినట్టు సరిపోతుందని.. అమరావతిలో అన్ని వసతులు ఉన్నాయని యధావిధిగా తనకలవాటైన రీతిలో రామోజీ చెలరేగిపోయారు.
కొప్పర్తికి అనుకూలతలు ఇవే..
ఇప్పటికే కొప్పర్తి పారిశ్రామికవాడను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. 6,914 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తోంది. అందులో రూ.750 కోట్లుతో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్‌ను నెలకొల్సింది. ఒక్క దీని పరిధిలోనే రూ.10 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. తద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి.
భవిష్యత్‌లో మొత్తంగా కొప్పర్తి పరిధిలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో కొప్పర్తిలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. దీంతో కేంద్రానికి కొప్పర్తి పేరును సూచిస్తూ ప్రతిపాదనలు పంపింది. దీన్ని జీర్ణించుకోలేని ఈనాడు తనకలవాటైన యధేచ్ఛగా శివాలెత్తిపోయింది.
రూ.1000 కోట్లతో కొత్త నగరం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిరి్మంచాలనుకున్న ఒక్కో నగరానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. కొత్త నగరాలకు ఎంపిక చేసిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లు ఇస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా అధికార యంత్రాంగం కొప్పర్తిని కొత్త నగరంగా ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత, భవిష్యత్‌లో ప్రత్యక్షంగా లభించే ఉద్యోగాలు, చెన్నై, బెంగళూరు, బొంబాయి వంటి మహానగరాలకు ఉన్న కనెక్టివిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రానికి ప్రతిపాదించింది.
వాస్తవం ఇదయితే.. సీఎం వైఎస్ జగన్ తన సొంత గడ్డ కోసం అమరావతిని విస్మరిస్తున్నారని ‘ఈనాడు’ తన కడుపు మంటను వెళ్లగక్కింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తమ పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉన్న అమరావతిని తప్ప మరే ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ సైతం అమరావతినే కొత్త నగరంగా ఎంపిక చేయాలని ఈనాడు పల్లవి ఎత్తుకుంది.
Comments
Please login to add a commentAdd a comment