Rayalaseema region
-
కొప్పర్తిపై కడుపు మంట!
సాక్షి ప్రతినిధి, కడప: వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ‘ఈనాడు’ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతోంది. సీమ ప్రగతిని తట్టుకోలేక విషం కక్కుతోంది. అయితేగియితే తమ పెట్టుబడిదారుల మానసపుత్రిక అమరావతి అభివృద్ధి చెందాలి కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఏమిటనే రీతిలో శివాలెత్తిపోతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈనాడులో ఒక కథనాన్ని వండివార్చింది. అన్ని వసతులు ఉన్న అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని యధావిధిగా రామోజీ చిందులు తొక్కారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు దేశంలో 8 కొత్త నగరాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఒక నగరాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు కోరగా ప్రభుత్వం కడప సమీపాన ఉన్న కొప్పర్తిని ఎంపిక చేసింది. కొప్పర్తి ఇప్పటికే ఇండ్రస్టియల్ హబ్‌గా భాసిల్లుతోంది. పలు కంపెనీలు ఇక్కడ తమ తయారీ యూనిట్లను సైతం ప్రారంభించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొప్పర్తిని కొత్త నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఇది తప్పన్నట్టుగా.. రాష్ట్రంలో అమరావతి తప్ప మరేదీ ఊరు కాదన్నట్టుగా ‘ఈనాడు’ కడుపు మంట’తో చెలరేగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కొత్త నగరాల ఎంపికకు అమరావతి అచ్చు గుద్దినట్టు సరిపోతుందని.. అమరావతిలో అన్ని వసతులు ఉన్నాయని యధావిధిగా తనకలవాటైన రీతిలో రామోజీ చెలరేగిపోయారు. కొప్పర్తికి అనుకూలతలు ఇవే.. ఇప్పటికే కొప్పర్తి పారిశ్రామికవాడను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. 6,914 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తోంది. అందులో రూ.750 కోట్లుతో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్‌ను నెలకొల్సింది. ఒక్క దీని పరిధిలోనే రూ.10 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. తద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి. భవిష్యత్‌లో మొత్తంగా కొప్పర్తి పరిధిలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో కొప్పర్తిలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. దీంతో కేంద్రానికి కొప్పర్తి పేరును సూచిస్తూ ప్రతిపాదనలు పంపింది. దీన్ని జీర్ణించుకోలేని ఈనాడు తనకలవాటైన యధేచ్ఛగా శివాలెత్తిపోయింది. రూ.1000 కోట్లతో కొత్త నగరం కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిరి్మంచాలనుకున్న ఒక్కో నగరానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. కొత్త నగరాలకు ఎంపిక చేసిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లు ఇస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా అధికార యంత్రాంగం కొప్పర్తిని కొత్త నగరంగా ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత, భవిష్యత్‌లో ప్రత్యక్షంగా లభించే ఉద్యోగాలు, చెన్నై, బెంగళూరు, బొంబాయి వంటి మహానగరాలకు ఉన్న కనెక్టివిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రానికి ప్రతిపాదించింది. వాస్తవం ఇదయితే.. సీఎం వైఎస్ జగన్ తన సొంత గడ్డ కోసం అమరావతిని విస్మరిస్తున్నారని ‘ఈనాడు’ తన కడుపు మంటను వెళ్లగక్కింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తమ పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉన్న అమరావతిని తప్ప మరే ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ సైతం అమరావతినే కొత్త నగరంగా ఎంపిక చేయాలని ఈనాడు పల్లవి ఎత్తుకుంది. -
సీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం!
విశాఖపట్నం : పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలను ఉపరితల ఆవర్తనం ఆనుకుని ఉందని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
రాయలసీమపట్ల సీఎం చంద్రబాబు వివక్ష
-
సీమను కాపాడుకోవాలంటే 'పట్టిసీమ' కావాలి
-
సీమను కాపాడుకోవాలంటే 'పట్టిసీమ' కావాలి
హైదరాబాద్ : రాయలసీమను కాపాడుకోవాలంటే పట్టిసీమ ప్రాజెక్టు అవసరమని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో్ పట్టిసీమ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఏడాదిలోగా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా రాయలసీమకు నీరందిస్తామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు రెండు టెండర్లు మాత్రమే వచ్చాయని దేవినేని ఉమా తెలిపారు. -
ప్రశాంతంగా పోస్టుమెన్ రాత పరీక్షలు
కర్నూలులో 75, నంద్యాలలో 65 శాతం అభ్యర్థులు హాజరు కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాయలసీమ రీజియన్ పరిధిలోని అభ్యర్థులకు నిర్వహించిన పోస్టుమెన్/ మెయిల్‌గార్డు అభ్యర్థుల రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. కర్నూలు, నంద్యాలలో మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్ల చొప్పున 1,336 మంది నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద డివిజన్ స్థాయి పోస్టల్ అధికారులు సూపర్వైజర్లుగా వ్యవహరించారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను సైతం 10.15 గంటల వరకు అనుమతించారు. 19,278 మందికి హాల్‌టికెట్లు జారీ చేయగా, 13,943 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారని కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు చెప్పారు. కర్నూలులో 12,540 మందికి 9,520 మంది(75శాతం), నంద్యాలలో 6,733 మందికి 4423 మంది(65శాతం) పరీక్షలు రాశారన్నారు. మొత్తం మీద రీజియన్ పరిధిలో 72 శాతం హాజరు నమోదైనట్లు వివరించారు. హాల్‌టికెట్ నంబర్ల నమోదులో ఇక్కట్లు పరీక్ష నిర్వాహకులు అందించిన ఆన్సర్‌షీట్‌లో అంతా ఓఎంఆర్ విధానమే పాటించడంతో అభ్యర్థులు ఇక్కట్లకు గురయ్యారు. హాల్‌టికెట్ నంబరును అంకెల్లో రాయడమే కాకుండా వాటి ఎదురుగా ఉండే ఓఎంఆర్ గళ్లను కూడా పెన్నుతో దిద్ది పూరించాల్సి ఉండటంతో కొందరు అభ్యర్థులు తికమకపడ్డారు. అంకెల్లో సరిగ్గానే రాసినా ఓఎంఆర్ గళ్లు పూరించడంలో పొరపాట్లు చేశారు. ఈ విషయంలో పరీక్ష కేంద్రాల సూపర్వైజర్లు నిస్సహాయత వ్యక్తం చేయడంతో పరీక్ష పేపర్‌ను పరిగణనలోకి తీసుకుంటారో లేదోనని కొందరు ఆందోళనకు గురవుతున్నారు. -
కార్మికుల మెరుపు సమ్మె: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
అనంతపురం: తమను మానసికంగా వేధిస్తున్న రాయలసీమ రీజియన్ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ఎన్ఎంయూ కార్మికులు శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడీ వైఖరికి నిరసనగా రాయలసీమలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలోనిని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈడీపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలు విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. కార్మికుల మెరుపు సమ్మెతో సదరు జిల్లాలోని డిపోలలో దాదాపు 1500లకు పైగా బస్సులు నిలిచిపోయాయి. పండగ సందర్భంగా స్వస్థలాలకు పయనమైన ప్రయాణికులు... బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందే: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి కర్నూలును రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో బెరైడ్డి చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష సోమవారం ప్రారంభమైంది. స్థానిక జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన దీక్షలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా మూడేళ్లపాటు కొనసాగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందని, దీంతో రాజధాని కర్నూలును కాదని హైదరాబాద్‌కు తరలిపోయిందన్నారు. ప్రస్తుతం సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇందుకు కారణమైన కాంగ్రెస్‌తోపాటు సహకరించిన టీడీపీ, బీజేపీలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెనుకబాటుతో ఉన్న రాయలసీమ బాగు పడాలంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఈ ప్రాంత ప్రజాప్రతి నిధులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం ద్వారా ఒత్తిడి తేవాలని సూచించారు. అంతకుముందు గౌరీ గోపాల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. అక్కడి నుంచి రాజ్‌విహార్, జిల్లా పరిషత్తు గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి మహబూబ్ సాహెబ్, సమితి నాయకులు శ్రీరాములు, రామచంద్రారెడ్డి, త్యాగరాజు, కొండయ్య, సురేంద్రారెడ్డితోపాటు సివి.రామన్, కేవిఆర్, పుల్లయ్య, రవీంద్ర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలు, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు బెరైడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు. -
అటకెక్కిన రైల్వే ప్రాజెక్టులు
గుంతకల్లు, న్యూస్‌లైన్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రాయలసీమ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన నూతన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం అటకెక్కింది. ఇవి ఏళ్ల క్రితమే మంజూరైనా.. నిధులు విడుదల చేయడంలో రైల్వే శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నూతన రైలు మార్గాలతో పాటు రైలు మార్గాల సర్వేలు, గేజ్ మార్పిడి, డబ్లింగ్, విద్యుద్దీకరణ, ప్రయాణికులు, సిబ్బంది సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నింటిదీ ఇదే దుస్థితి. ఇప్పటికే పాలనాపరంగా, సాంకేతికంగా మంజూరైన పనులు చేపట్టాలంటే రూ.వేల కోట్లు అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. నిధుల గురించి ఎంపీలు పార్లమెంటులో కనీసం నోరు విప్పడం లేదు. త్రిశంకు స్వర్గంలో నూతన రైలు మార్గాలు మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేయించిన కడప - బెంగళూరు (వయా బంగారుపేట్) రైలు మార్గం నిర్మాణం ఇప్పటికీ బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. 2008-09 బడ్జెట్లో మంజూరైన ఈ రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, రైల్వే శాఖ 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంది. కడప నుంచి కోలార్ వరకు రైలు మార్గం నిర్మాణానికి రూ.1,760 కోట్లతో అంచనాలు రూపొందించారు. అప్పట్లో సర్వే కోసం రూ.29 కోట్లు కేటాయించారు. అక్కడితో ప్రాజెక్టు ప్రగతి ఆగిపోయింది. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 308.7 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మించాలని భావించి 1997-98లోనే రైల్వే బోర్డు అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు రూ.539.80 కోట్లు అవసరమని అప్పట్లో అంచనా వేశారు. ఈ వ్యయం నేడు మూడింతలు పెరిగిందని రైల్వే ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గం నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తామని చెప్పినప్పటికీ రైల్వే శాఖ ముందుకు రావడం లేదు. దీంతో 2004-05 నుంచి వరుసగా అంచనా వ్యయాన్ని సవరించి పంపుతూనే ఉన్నారు. 1996-97లో మంజూరైన నంద్యాల - ఎర్రగుంట్ల మార్గానికి నిధుల కొరత వేధిస్తోంది. దీనివల్ల ఈ మార్గంలోని బనగానపల్లి- నంద్యాల మధ్య పనులు పూర్తి కాలేదు. 1997-98 బడ్జెట్లో మహబూబ్‌నగర్ - మునీరాబాద్ మధ్య 246 కి.మీ మేర మంజూరైన రైలు మార్గం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మంత్రాలయం - కర్నూలు రోడ్డు (వయా ఎమ్మిగనూరు), పుట్టపర్తి-తిరుపతి(వయా కదిరి), గిద్దలూరు- భాక్రాపేట పనుల కోసం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు. ఇక మార్కాపురం - శ్రీశైలం మధ్య 65 కిలోమీటర్ల రైలు మార్గానికి 2007లో సర్వే చేపట్టారు. సర్వే నివేదికను అదే ఏడాది నవంబరు 26న రైల్వే బోర్డుకు నివేదించారు. అయినప్పటికీ నిధులు మంజూరు కావడం లేదు. నత్తనడకన డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు ఓబుళవారిపల్లె -కృష్ణపట్నం పోర్టు మధ్య దాదాపు 114 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు నిధుల కొరతతో పడకేశాయి. వెంకటాచలం వరకు పనులు పూర్తి చేసి వదిలిపెట్టారు. సికింద్రాబాద్- బెంగళూరు ప్రధాన మార్గంలో సికింద్రాబాద్ నుంచి డోన్ వరకు డబ్లింగ్ చేయాలని రైల్వే శాఖ భావించింది. అయితే... 2006 ఫిబ్రవరిలో సర్వే చేసి చేతులు దులుపుకుంది. ఈ మార్గం డబ్లింగ్ కోసం రూ.534.32 కోట్లు అవసరం. ఇక ముంబయి - చెన్నై ప్రధాన మార్గంలోని రేణిగుంట - నందలూరు మధ్య 85 కి.మీ. విద్యుద్దీకరణ పనులను 2004 జూన్‌లో పూర్తి చేయాల్సి ఉండగా... అష్టకష్టాలు పడి గత ఏడాది పూర్తి చేశారు. నందలూరు - ముద్దనూరు మధ్య 55 కిలోమీటర్లు, ముద్దనూరు - కొండాపురం మధ్య 24 కి.మీ, కొండాపురం - గుంత కల్లు మధ్య 104 కి.మీ పనులు కూడా ఆ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తయ్యాయి. నందలూరు - వాడి మధ్య 451 కి.మీ. రైలు మార్గం విద్యుద్దీకరణకు రూ.1,200 కోట్లను కేటాయించారు. ఈ పనులు 2010 డిసెంబరు నాటికే పూర్తి కావాలి. అయితే.. నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుకు సాగని విద్యుత్తు లోకోషెడ్డు పనులు రైల్వే డివిజన్ కేంద్రమైన గుంతకల్లులో రూ.74.3 కోట్లతో విద్యుత్తు లోకోషెడ్డును ఏర్పాటు చేసేందుకు డీటైల్డు రిపోర్టును రైల్వేబోర్డుకు పంపారు. వంద విద్యుత్తు లోకో ఇంజన్ల సామర్థ్యం గల ఈ షెడ్డులో 600 మందికి పైగా సిబ్బందిని నియమించే అవకాశముంది. దీన్ని 2012 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో అంచనా వ్యయం కాస్తా రెటి ్టంపయ్యే అవకాశం ఉందని స్థానిక రైల్వే అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
అభివృద్ధి చేస్తే.. పదేళ్లు ప్రతిపక్షంలో ఎందుకుంటావ్ ?
చంద్రబాబును కడిగేసిన అక్బరుద్దీన్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయావు భవిష్యత్తుపై చెప్పలేని ఆందోళన ఉంది మీరు చెప్పేదొకటి, చేసేదొకటి మిమ్మల్ని నమ్మే పరిస్థితే లేదు స్పష్టమైన విధానమంటూ లేదు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం సభలో తీవ్రంగా తూర్పారబట్టారు. ‘‘అభివృద్ధి చేస్తే పదేళ్లుగా ప్రతిపక్షంలో ఎందుకుంటావు? భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఎందుకుంది? నువ్వు ప్రజల నమ్మకాన్ని కోల్పోయావు. నిన్ను నమ్మే పరిస్థితి లేదు. మీ వైఖరి చెప్పేదొకటి, చేసేది మరొకటి అన్నట్టుగా ఉంటుంది’’ అంటూ దుమ్మెత్తిపోశారు. తెలంగాణ బిల్లుపై జరుగుతున్న చర్చలో భాగంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 27 ఏళ్ల 5 నెలల పాటు రాయలసీమ ప్రాంతం వారే ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. అయినా రాయలసీమ అభివృద్ధి చెందలేదన్నారు. ఇప్పటికీ అనేక సమస్యలున్నాయంటూ సీమ నుంచి సీఎంలుగా పని చేసిన వారి జాబితాను చదివారు. అందులో చంద్రబాబును కూడా ప్రస్తావించారు. తనకు ఐదేళ్ల పాటు సమయమిస్తే రాయలసీమను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. బాబు స్పందిస్తూ, హైదరాబాద్‌లో 400 ఏళ్ల కాలంలో నిజాం చేయని అభివృద్ధిని తాను 9 ఏళ్ల కాలంలోనే చేశానన్నారు. ‘హైటెక్ సిటీ కట్టాం. రోడ్లు వేశాం. సింగపూర్‌లా మార్చాం. అప్పట్లో ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కర్ఫ్యూ ఉండేది’ అంటూ చెప్పుకొచ్చారు. బాబు వాదనను అక్బర్ తిప్పికొట్టారు. ‘‘మీరు అంత అభివృద్ధి చేస్తే రెండుసార్లు బ్యాలెట్‌కు ఎందుకు దూరమయ్యారు? మీ భవిష్యత్తెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఎందుకుంది? గోధ్రా అల్లర్లు జరిగినప్పుడు ముస్లిం ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటానన్న మీరు బీజేపీ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఎప్పుడూ మాటపై నిలబడరు. ఒకటి చెప్పి మరొకటి చేస్తారు. స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే ప్రజలకు మీపై నమ్మకం పోయింది’’ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. దాంతో టీడీపీ సభ్యులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. నిజాంపై పొగడ్తలు కాంగ్రెస్‌కు చెందిన చెన్నారెడ్డి హయాంలో హైదరాబాద్‌లో మత కల్లోలాలు జరిగితే, ఆ తర్వాత ఆ పార్టీకే ఎంఐఎం మద్దతిచ్చిందని టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. అక్బర్ స్పందిస్తూ, హైదరాబాద్ అభివృద్ధికి నిజాం ఎంతో కృషి చేశారన్నారు. హైదరాబాద్ విలీనం కాకముందున్న విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, పరిశ్రమలు, నీటిపారుదల సౌకర్యాల వంటి వివరాలను పేర్లతో సహా సభ ముందుం చారు. ‘‘నిజాం హయాంలోనే హైదరాబాద్‌లో ఆర్థికంగా మిగులుండేది. సొంత తపాలా, కరెన్సీ ఉండేవి. కిరణ్, అశోక్ గజపతిరాజు, వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి వారు చదివిన హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌ను నిర్మించింది నిజామే. నిజాం ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ వల్ల భారత కోకిల సరోజినీ నాయుడు వంటివారు లండన్‌లో చదువుకున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిజాం ఏర్పాటు చేసిన థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం అమ్ముకుంది. ఆఖరికి ఇప్పుడు మనమున్న అసెంబ్లీ భవనాన్ని కూడా నిజాం నిర్మించినదే’’ అని పేర్కొన్నారు. అందుకు మద్దతుగా టీఆర్ఎస్ సభ్యులు బల్లలు చరిచారు. ఈ సమయంలో మళ్లీ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. నిజాంపై ఎంఐఎంకు ప్రేమ ఉందని టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. టీఆర్ఎస్ కూడా అదే వారసత్వాన్ని తీసుకుందన్నారు. సీడెడ్ జిల్లాలను నిజాం నాడు బ్రిటిష్ వారికి రూ.9 లక్షలకు అమ్మి, ఆ డబ్బుతోనే జల్సాలు చేశారన్నారు. ఆ వాదనను అక్బర్ మళ్లీ తిప్పికొట్టారు. ‘‘ఇండో చైనా యుద్ధ సమయంలో కేంద్రానికి నిజాం రెండు లారీల బంగారు నాణేలిచ్చారు. బనారస్ హిందూ యూనివర్సిటీకి రూ.10 లక్షలిచ్చారు. యాదగిరిగుట్ట, తిరుమల, భద్రాచలం వంటి పలు దేవాలయాలకు నిధులిచ్చి నిజమైన లౌకికవాదాన్ని ప్రదర్శించారు’’ అని చెప్పారు. కాంగ్రెస్ తరఫున మంత్రి శైలజానాథ్, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు అక్బర్‌పై విమర్శలకు దిగారు. జాతి వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారనే విధంగా వ్యాఖ్యానించారు. దాంతో ఎంఐఎం సభ్యులు తీవ్ర నిరసనకు దిగారు. క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు. అసదుద్దీన్‌తో కేటీఆర్ భేటీ సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు అసెంబ్లీ ఆవరణలో సోమవారం భేటీ అయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరుపై, రాజ్యసభ అభ్యర్థుల అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసినట్టు ప్రచారం చేసుకుం టున్న బాబుకు దీటుగా సమాధానం చెప్పాలని, టీడీపీని దెబ్బకొట్టడానికి ఎవరి మార్గంలో వారు పనిచేయాలని అనుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిని నిలబెడుతున్నారా అని కేటీఆర్‌ను అసదుద్దీన్ ప్రశ్నించగా.. ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పటిదాకా 23 మంది ఎమ్మెల్యేల బలం తమకు ఉందని, అయితే రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే దాదాపు 40 మంది మద్దతు అవసరమని అన్నారు. మిగిలిన వారి మద్దతు గురించి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని కేటీఆర్ సమాధానమిచ్చారు. -
రాష్ట్రాన్ని మూడుగా విభజించాలి: బైరెడ్డి రాజశేఖరరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయులసీవు వాసులమైన తావుు కోస్తా ప్రాంతంతో ఎట్టిపరిస్థితుల్లో కలిసి ఉండలేమన్నారు. విభజన అనివార్యమైతే 1953-56లో ఉన్న పరిస్థితి (కర్నూలు రాజధాని)ని యథాతథంగా కొనసాగించాలన్నారు. రాజధాని హైదరాబాద్‌కు మారడంతో కర్నూలు రాజధానిని కోల్పోయాం. ఇప్పుడు ఎక్కడో మంగళగిరి, గుంటూరులో రాజధాని ఇస్తే ఒప్పుకోం. ఇరు ప్రాంతాల మధ్య వివాదాలు మొదలవుతాయి’ అని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మూడు రాష్ట్రాలుగా ఇస్తే ఎక్కడో ఓ చోట రాజధానిని ఏర్పాటు చేసుకుంటామని విన్నవించగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.చంద్రబాబు యాత్ర ను ప్రజలు అడ్డుకుంటారన్నారు. -
రాయలసీమకు విస్తారంగా వర్షాలు
అల్పపీడన ద్రోణి చురుగ్గా ఉన్న కారణంగా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడుపై ఓ వైపు రుతుపవనాలు ప్రభావం చూపించడం, దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుండడం వల్ల రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి వరకు కూడా ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందన్నారు. దీని కారణంగా రానున్న 24గంటల్లో సీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు విదర్భ, షోలాపూర్ మీదుగా మేఘాలు ఆవరించడం వల్ల తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయన్నారు. గురువారం సాయంత్రం లోపు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది.