సీమను కాపాడుకోవాలంటే 'పట్టిసీమ' కావాలి
హైదరాబాద్ : రాయలసీమను కాపాడుకోవాలంటే పట్టిసీమ ప్రాజెక్టు అవసరమని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో్ పట్టిసీమ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఏడాదిలోగా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా రాయలసీమకు నీరందిస్తామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు రెండు టెండర్లు మాత్రమే వచ్చాయని దేవినేని ఉమా తెలిపారు.