కార్మికుల మెరుపు సమ్మె: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు | RTC Employees protests at Bus Depots in Rayalaseema region | Sakshi

కార్మికుల మెరుపు సమ్మె: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు

Sep 27 2014 9:03 AM | Updated on Sep 2 2017 2:01 PM

తమను మానసికంగా వేధిస్తున్న రాయలసీమ రీజియన్ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ఎన్ఎంయూ కార్మికులు శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అనంతపురం: తమను మానసికంగా వేధిస్తున్న రాయలసీమ రీజియన్ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ఎన్ఎంయూ కార్మికులు శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడీ వైఖరికి నిరసనగా రాయలసీమలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలోనిని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈడీపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలు విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు.

కార్మికుల మెరుపు సమ్మెతో సదరు జిల్లాలోని డిపోలలో దాదాపు 1500లకు పైగా బస్సులు నిలిచిపోయాయి. పండగ సందర్భంగా స్వస్థలాలకు పయనమైన ప్రయాణికులు... బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement