employees protests
-
అసిస్టెంట్ కమిషనర్‌పై చర్యలు!
► విశాఖలో కొనసాగించబోమన్న కమిషనర్ ► కలెక్టర్ సమక్షంలో హామీ ► ఆందోళన విరమించిన దేవాదాయ ఉద్యోగులు సాక్షి, విశాఖపట్నం : దేవాదాయ, ధర్మాదాయశాఖ కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగులు ఆందోళన విరమించారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్ వేధింపులకు నిరసనగా నాలుగు రోజుల నుంచి వీరంతా సామూహిక సెలవులో ఉన్నారు. విధులను బహిష్కరించి వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఏసీ పుష్పవర్థన్ పై చర్యలు తీసుకోవాలని, ఇక్కడ నుంచి బదిలీ చేయాలని వీరు డిమాండ్ చేస్తూ తొలుత ఆ శాఖ కమిషనర్ వై.వి.అనురాధకు, ఆ తర్వాత విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబుకు విన్నవించారు. దీనిపై కమిషనర్ అనురాధ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ)తో విచారణకు ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ వివాదాన్ని పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందులోభాగంగా శుక్రవారం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ విచారణ చేపట్టారు. శనివారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దేవాదాయశాఖ డిప్యూటి కమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి సహా, ఈవోలు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. కమిషనర్ అనురాధతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. సహాయ కమిషనర్ పుష్పవర్థన్ ఈనెల 12 వరకు సెలవులో ఉన్నారని, అనంతరం ఆయనను విశాఖ నుంచి బదిలీ చేస్తామని, ఇక్కడ కొనసాగించబోమని హామీ ఇచ్చారు. అందువల్ల ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వహించుకోవచ్చని చెప్పారు. దీంతో ఉద్యోగులు, ఈవోలు చర్చించుకున్నారు. 12 తర్వాత ఏసీపై చర్యలు తీసుకోని పక్షంలో 13వ తేదీ నుంచి మళ్లీ ఆందోళన కొనసాగిస్తామని కలెక్టర్‌కు స్పష్టం చేశారు. కాగా కమిషనర్ హామీతో విజయదశమి పండగను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తామంతా తిరిగి విధులకు హాజరవుతున్నామని జిల్లా దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు ఎ.జగన్నాధరావు ’సాక్షి’కి చెప్పారు. కలెక్టర్‌తో సమావేశమైన వారిలో ఈవోలు జగన్నాధరావు, ఎ¯ŒS.ఎల్.ఎస్.శాస్తి్ర, పి.శేఖర్‌బాబు, పీఎస్.ఎన్ మూర్తి, దేవాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి జి.కృష్ణమాచారి తదితరులున్నారు. -
బ్యాంకుల సమ్మె
* స్తంభించిన లావాదేవీలు * ఏటీఎంలే దిక్కు * డిసెంబరులో మళ్లీ సమ్మె చెన్నై, సాక్షి ప్రతినిధి: ఐదేళ్లకోసారి పెంచాల్సిన జీతాలు పెంచకపోవడంతో బుధవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని బ్యాంకు ఉద్యోగులు సమ్మె పాటించాయి. బ్యాంకు ఉద్యోగ సంఘాల జాతీయ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులందరూ తమ విధులను బహిష్కరించారు. ఉద్యోగ, అధికార సంఘాలతో బ్యాంకు యాజమాన్యం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్లకు ఒకసారి జీతాలను పెంచాల్సి ఉంది. ఈ మేరకు 2007లో 17.5 శాతం జీతాన్ని పెంచారు. అయితే ఆ తరువాత ఐదేళ్ల (2012)లో జీతాలను పెంచలేదు. ఈ దఫా 25 శాతం జీతాన్ని పెంచాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌పై ఇప్పటికి 13 సార్లు యాజమాన్యాలతో చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఈనెల 10న ఢిల్లీలో జరిగిన చర్చలు విఫలం కావడంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. జాతీయ సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలోని 8400 బ్యాంకులు మూతపడ్డాయి. సుమారు 60 వేల మంది అధికారులు, ఉద్యోగులు విధులను బహిష్కరించారు. అన్ని లావాదేవీలు నిలిచిపోయాయి. ఆన్లైన్, ఏటీఎంల సేవలను సైతం స్తంభింప జేస్తున్నట్లు ప్రకటించినా ఏటీఎంలు పనిచేశాయి. చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. బ్యాంకు యాజమాన్యాలు దిగిరాని పక్షంలో డిసెంబరు 2న తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, డిసెంబరు 3,4,5 తేదీల్లో మిగిలిన రాష్ట్రాల్లో విధులను బహిష్కరించాలని బుధవారం నాటి సమ్మెలో నిర్ణయం తీసుకున్నారు. -
కార్మికుల మెరుపు సమ్మె: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
అనంతపురం: తమను మానసికంగా వేధిస్తున్న రాయలసీమ రీజియన్ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ఎన్ఎంయూ కార్మికులు శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడీ వైఖరికి నిరసనగా రాయలసీమలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలోనిని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈడీపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలు విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. కార్మికుల మెరుపు సమ్మెతో సదరు జిల్లాలోని డిపోలలో దాదాపు 1500లకు పైగా బస్సులు నిలిచిపోయాయి. పండగ సందర్భంగా స్వస్థలాలకు పయనమైన ప్రయాణికులు... బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్‌తో ఆందోళనలు ఉధృతం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసే ఇద్దరి అధికారుల మధ్య ముదిరిన విభేదాలు ఐటీడీఏను అస్తవ్యస్తంగా మార్చాయి. ఐటీడీఏ పీవో జనార్దన్‌కు, డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదట నుంచి మనస్పర్థాలు ఉన్నాయని ప్రచారం ఉంది. రషీద్‌ను పీవో మూడు రోజుల క్రితం సస్పెండ్ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. పీవో చర్యలను నిరసిస్తూ ఐటీడీఏ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. దీంతో ఐటీడీఏ సిబ్బంది లేక వెలవెల బోతోంది. పనుల నిమిత్తం వచ్చే గిరిజనులు, ఇతరులు వెనుదిరిగి పోతున్నారు. సమస్యలు పరిష్కరించకుం టే సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న తొమ్మిది ఐటీడీఏలలో ఆందోళన నిర్వహిస్తామని ట్రైబల్ వెల్ఫెర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గోపాల్, కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. పరిస్థితి చేయిజారక ముందే ఉన్నతాధికారులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. సఖ్యత లేదని ప్రచారం.. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌కు డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదటి నుంచే సఖ్యత లేదనే ప్రచారం ఐటీడీఏలో ఉంది. ఈ క్రమంలో పీవో నివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముక్కుసూటిగా వ్యవహరించడం, ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఎవరికి మింగుడు పడటం లేదు. దాదాపు 30 మందికిపైగా ఉద్యోగులను సస్పెండ్, వంద మందికిపైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రషీద్‌కు పీవోకు పడక పోవడంతో జూలై 31న అనారోగ్యం కారణం చూపుతూ రషీద్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపించారని ప్రచారం ఉంది. రషీద్ స్థానంలో అప్పటి ఏపీవో జనరల్ వెంకటేశ్వర్లు అదనపు బాధ్యతలు చేపట్టారు. అయన పదవీ విరమణతో ఏవో భీమ్ డీడీటీడబ్ల్యూగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ చివరి వారంలో గిరిజన సంక్షేమశాఖలో సుపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నారాయణరెడ్డిని ఆశ్రమాలకు సరుకులు సకాలంలో సరఫరా చేయడం లేదని అక్టోబర్ 31న సస్పెండ్ చేశారు. ఇలా గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో తెలియక ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డీడీ విధుల్లో చేరడంతో.. అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన డీడీటీడబ్ల్యూ రషీద్ కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. వేతన చెల్లింపులో సాంకేతికలోపం ఏర్పడటంతో అయనను ప్రభుత్వం తిరిగి యథాస్థానికి పంపించింది. గత నెల 28న రషీద్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 5న విధుల్లో చేరారు. అప్పటికే డీటీఏఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు గిరిజన సంక్షేమశాఖలో విధులు నిర్వహిస్తూ సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఈ నెల 9 నుంచి ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐటీడీఏ పీవో అనారోగ్యం కారణంగా సెలవు పెట్టడంతో 13 నుంచి 16వ తేదీ వరకు రషీద్ ఇన్చార్జి పీవోగా వ్యవహరించారు. ఈ సమయంలో 15న డీటీఏఫ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని దీక్ష విరమింపజేశారు. ఈ నేపథ్యంలోనే జీవో ఎంఎస్ నంబర్ 274 ప్రకారం రషీద్‌ను పీవో సస్పెండ్ చేశారు. డీడీటీడబ్ల్యూను సస్పెండ్ చేసే అధికారం ఐటీడీఏ పీవోకు లేకున్నా జీవో నంబర్ 274ను ఆధారంగా చూపుతూ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఉద్యోగులంత ఏకమై ఆందోళన ఐటీడీఏ పీవో తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఏకమయ్యారు. ఉద్యోగులను సస్పెండ్ చేయడం, షోకాజ్ నోటీసులు జారీచేయడం, నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వకుండా విచారణ పేరిట కాలయాపన చేయడంపై ఆందోళన బాట పట్టారు. డీడీటీడబ్ల్యూ, గజిటెడ్, నాన్‌గజిటెడ్, ఉపాధ్యాయుల సస్పెన్షన్లను ఎత్తి వేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నుంచి ఐటీడీఏ ఎదుట అందోళన నిర్వహిస్తున్నారు. పీవో కిందిస్థాయి ఉద్యోగులతో పనులు చేయిస్తూ గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాలి కాని ఇలా చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. పీవో వైఖరి మార్చుకోకపోతే న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టడంతో ఐటీడీఏ అస్తవ్యస్తంగా తయారైంది. గిరిజనుల అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది.