సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయులసీవు వాసులమైన తావుు కోస్తా ప్రాంతంతో ఎట్టిపరిస్థితుల్లో కలిసి ఉండలేమన్నారు. విభజన అనివార్యమైతే 1953-56లో ఉన్న పరిస్థితి (కర్నూలు రాజధాని)ని యథాతథంగా కొనసాగించాలన్నారు. రాజధాని హైదరాబాద్‌కు మారడంతో కర్నూలు రాజధానిని కోల్పోయాం. ఇప్పుడు ఎక్కడో మంగళగిరి, గుంటూరులో రాజధాని ఇస్తే ఒప్పుకోం. ఇరు ప్రాంతాల మధ్య వివాదాలు మొదలవుతాయి’ అని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మూడు రాష్ట్రాలుగా ఇస్తే ఎక్కడో ఓ చోట రాజధానిని ఏర్పాటు చేసుకుంటామని విన్నవించగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.చంద్రబాబు యాత్ర ను ప్రజలు అడ్డుకుంటారన్నారు.