చంద్రబాబు ఒక్కసారీ ఇంగ్లీషులో మాట్లాడలేదు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చినపుడు ప్రత్యేక హోదా గురించి మీడియా ఎదుట ఒక్కసారి కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేదని అన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమవుతుందని చంద్రబాబుకు భయమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో కలసి సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు.
ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రపతిని తాము కలవడానికి ప్రధాన ఉద్దేశం ఇదేనని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉందో రాష్ట్రపతికి వివరించామని తెలిపారు. మీరే న్యాయం చేయాలని ప్రణబ్ను కోరి వినతి పత్రం సమర్పించామని చెప్పారు. వైఎస్ జగన్ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే..
- రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఏపీ కోల్పోతున్నందున, దీనికి పరిహారంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాలు చెప్పాయి. ఆ తర్వాతే రాష్ట్రాన్ని విడగొట్టాయి
- పార్లమెంట్లో ఇచ్చిన హామీని నెరవేర్చనపుడు ప్రజాస్వామ్యంలో ఎవరిని అడగాలి?
- పార్లమెంట్లో ఇచ్చిన మాటను తప్పితే ఎవరి దగ్గరకు వెళ్లాలి, ఎవరిని అడగాలి?
- ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదు
- కేంద్రాన్ని గట్టిగా అడిగే ధైర్యం ఆయనకు లేదు
- వెంకయ్యనాయుడుతో కలసి కేంద్రం రాష్ట్రానికి చాలా చేస్తోందంటారు
- మరో సందర్భంలో అన్యాయం చేస్తోందంటారు
- ఏపీలో అరుణ్ జైట్లీని తప్పుపడుతూ మాట్లాడుతారు
- అదే ఢిల్లీకి వచ్చినపుడు ఈ విషయం అడగరు. కృష్ణా పుష్కరాలకు పిలవడానికి వచ్చానని చెబుతారు
- ద్వంద ప్రమాణాలు పాటిస్తే ఎలా?
- చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏం సాధించాడు?
- ఎక్కడా ఇంగ్లీషులో మోదీని విమర్శించలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు
- తెలుగులో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు
- ఓ వైపు దేవుడి గుడులను కొట్టేస్తూ.. పుష్కరాలకు ఆహ్వానించేందుకు ఢిల్లీకి వస్తారు
- చంద్రబాబుకు దేవుడిపై ప్రేమ ఉందా అంటే అదీ లేదు
- విజయవాడలో 40 గుళ్లను తొలగించారు
- దేవుని భూములను కూడా వదిలిపెట్టరు. బినామీలకు తక్కువ ధరకు అమ్మేస్తారు
- చంద్రబాబు మాదిరిగా పనిచేస్తే దేశం ఎక్కడికో వెళ్లిపోతుందని రాష్ట్రపతి అన్నారట
- రాష్ట్రపతిని కలసినప్పుడు అక్కడ ఏ విలేకరి కూడా ఉండడు
- రాష్ట్రపతిని కలసినప్పుడు ఒకరు వచ్చి ఓ ఫొటో తీసుకుని వెళతారు
- అలాంటిది చంద్రబాబు గురించి రాష్ట్రపతి పొగిడినట్టు వార్తలు వస్తాయి
- అన్ని పార్టీలు కలసి ఢిల్లీకి వచ్చి ప్రత్యేక హోదా అడుగుతామని చంద్రబాబును అడిగా. ఆయన రాడు, ఎవరినీ తీసుకుని పోడు
- ప్రత్యేక హోదా రాకుంటే రాష్ట్రం నష్టపోతుందని తెలిసి, ఈ విషయం మరుగున పడుతుందని తెలిసి మాలాంటోళ్లు వచ్చి అడుగుతున్నాం
- ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం మోదీ గారి తప్పు, దీనికోసం పోరాడకపోవడం చంద్రబాబు తప్పు
- ప్రత్యేక హోదా అంశం మీద కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర పార్టీల నాయకులను కలుస్తాం
- అలాగే మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్లు కోరుతాం. అవకాశం ఇస్తే ప్రత్యేక హోదా గురించి అడుగుతాం, హోదా ఇవ్వకపోతే రాష్ట్రం ఎలా నష్టపోతుందో వివరిస్తాం
- ప్రత్యేక హోదా కోసం కాదు పుష్కరాలకు పిలవడానికి వచ్చామని చెప్పబోం
- అడిగే విషయాన్ని గట్టిగా అడుగుతాం
- ప్రత్యేక హోదా విషయాన్ని మేం వదిలేస్తే అడిగేవాళ్లు లేరు
- ప్రత్యేక హోదాకు మీడియాతో పాటు అందరి మద్దతు కావాలి
- ఈ వాళ రాలేదని వదిలేయడం కన్నా సాధనకోసం అందరూ కలసి పోరాడుతాం
-
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు.. హోదా వచ్చే వరకు పోరాటం చేస్తాం