Byreddy Rajasekhara Reddy
-
హిందూ ద్రోహి సీఎం చంద్రబాబు!
కడప కల్చరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిందూ ద్రోహిగా మారాడని వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రహదారుల నిర్భంద కార్యక్రమాన్ని అమలు కాకుండా పోలీసులు ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. సాయంత్రం ఆయన పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాను రాను మతాల మధ్య చిచ్చుపెడుతూ హిందు మత ద్రోహిగా మారుతున్నాడని దుయ్యబట్టారు. సమస్యకు కారణమైన వారిని వదిలి ధర్మాగ్రహం వ్యక్తం చేసిన పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడం ఏం న్యాయమో ఆయనే చెప్పాలన్నారు. హిందూ దేశంలో ప్రజలు విశ్వసించే ధర్మాలకు ప్రమాదం వాటిల్లుతోందని మనం హిందూ దేశంలోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. సంఘ విద్రోహశక్తిగా మారుతున్న సీఎం చంద్రబాబును రానున్న ఎన్నికల్లో మట్టి కరిపించేందుకు హిందువులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హిందూ ద్రోహి చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడే సమ యం ఆసన్నమైందని హెచ్చరించారు. పోలీసులు రామకృష్ణారెడ్డితోపాటు బీజేపీ నాయకుడు బైరెడ్డి మధుసూదన్, పెసల సాంబశివారెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు కిస్టిపాటి వెంకట్రామిరెడ్డి, ఆగ్రోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చెన్నక్రిష్ణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నళ్లోల్ల రాజారాం, బిజేపీ ఓబీసీ సంఘం అధ్యక్షుడు దుర్గం దస్తగిరి తదితరులు అరెస్టు చేశారు. -
నాపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయండి
హైకోర్టులో బెరైడ్డి రాజశేఖరరెడ్డి పిటిషన్ హైదరాబాద్: తనపై కర్నూలు త్రీటౌన్ పోలీసులు నమో దు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్కు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో అభ్యర్థించారు. గురువారమే పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, సమయాభావం వల్ల విచారణకు రాలేదు. బెరైడ్డి తరఫు న్యాయవాదులు సోమవారం మరోసారి న్యాయమూర్తి ముందు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించనున్నారు. -
బెరైడ్డికి హైకోర్టులో చుక్కెదురు
హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖరరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బెరైడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్థులకు అధ్యక్షుడి హోదాలో బీ ఫాం ఇవ్వాల్సి ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న బెరైడ్డి అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పార్టీ ఉపాధ్యక్షుడు కూడా బీ ఫాం ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పగిడియాల మండలంలోని మచ్చుమర్రి గ్రామానికి చెందిన తెలుగు సాయిఈశ్వరుడు గత నెల 15న హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక బెరైడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొం దరు ఉన్నారంటూ మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏడుగురు నిందితులపై కర్నూలు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెరైడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ రెడ్డి కాంతారావు మంగళవారం విచారించారు. బెరైడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో పిటిషనర్ పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కావాలనే పిటిషనర్‌ను ఈ కేసులో ఇరికించారన్నారు. ఈ వాదనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్‌కుమార్ దేశ్‌పాండే తోసిపుచ్చారు. బెరైడ్డిపై నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. నిజంగా ఆయన పాత్ర లేకుంటే ఈపాటికే లొంగిపోయి ఉండేవారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఈ ప్రభావం కేసు దర్యాప్తుపై ఉంటుందని నివేదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించారు. -
రాజధాని సీమలోనే ఉండాలి : బైరెడ్డి రాజశేఖర రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు రాజధాని ఎంపిక రాయలసీమనుంచే జరగాలని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) విజ్ఞప్తి చేసింది. ఆర్పీఎస్ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇదే డిమాండ్‌తో ఆర్పీఎస్ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు బెరైడ్డి తెలిపారు. -
బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై దాడి, వాహనం ధ్వంసం
రాయలసీమ నేత, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డ్రైవర్ దురుసుగా ప్రవర్తించడంతో తిరుపతి సమీపంలోని వరదాయపాలెంలో స్థానికులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళుతున్న ఆటో సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఆటో డ్రైవర్ ను బైరెడ్డి డ్రైవర్ చితకబాదారు. డ్రైవర్ పై దాడి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు బైరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్ ను స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. స్థానికులు జరిపిన దాడిలో బైరెడ్డి డ్రైవర్ కు తీవ్రగాయలైనట్టు సమాచారం. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిపైనా స్థానికులు దాడి చేసినట్టు తెలుస్తోంది. -
'మంగళగిరిలో టీఆర్ఎస్ నేతలకు భూములు'
తిరుపతి: రాష్ట్ర విభజన అంటూ జరిగితే రాయలసీమ జిల్లాలో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీలు పదవులకు రాజీనామా చేసినా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ నాయకుడు చిత్తశుధ్దితో పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. మంగళగిరి వద్ద కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవడం కోసమే పార్టీలన్ని ఢిల్లీ వెళ్తున్నాయని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నేతలు మంగళగిరి వద్ద భూములు కొన్నారని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ భూములు కొన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని అంతకుముందు ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ వాసులమైన తాము కోస్తా ప్రాంతంతో ఎట్టిపరిస్థితుల్లో కలిసి ఉండలేమన్నారు. విభజన అనివార్యమైతే 1953-56లో ఉన్న పరిస్థితి (కర్నూలు రాజధాని)ని యథాతథంగా కొనసాగించాలన్నారు. రాజధాని హైదరాబాద్‌కు మారడంతో కర్నూలు రాజధానిని కోల్పోయమని, ఇప్పుడు ఎక్కడో మంగళగిరి, గుంటూరులో రాజధాని ఇస్తే ఒప్పుకోమని స్పష్టం చేశారు. -
రాష్ట్రాన్ని మూడుగా విభజించాలి: బైరెడ్డి రాజశేఖరరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయులసీవు వాసులమైన తావుు కోస్తా ప్రాంతంతో ఎట్టిపరిస్థితుల్లో కలిసి ఉండలేమన్నారు. విభజన అనివార్యమైతే 1953-56లో ఉన్న పరిస్థితి (కర్నూలు రాజధాని)ని యథాతథంగా కొనసాగించాలన్నారు. రాజధాని హైదరాబాద్‌కు మారడంతో కర్నూలు రాజధానిని కోల్పోయాం. ఇప్పుడు ఎక్కడో మంగళగిరి, గుంటూరులో రాజధాని ఇస్తే ఒప్పుకోం. ఇరు ప్రాంతాల మధ్య వివాదాలు మొదలవుతాయి’ అని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మూడు రాష్ట్రాలుగా ఇస్తే ఎక్కడో ఓ చోట రాజధానిని ఏర్పాటు చేసుకుంటామని విన్నవించగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.చంద్రబాబు యాత్ర ను ప్రజలు అడ్డుకుంటారన్నారు. -
'విభజన అనివార్యమైతే మూడు ముక్కలు చేయండి'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైతే మూడు ముక్కలు చేయాల్సిందేనని బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చిన తరుణంలో ఆయన గురువారం రాష్ట్రపతిని కలిసి తమన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఒకవేళ విభజన అనివార్యమైతే రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన పరిస్థితుల్లో, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానిలు ఉండాలని తెలిపారు. సీమాంధ్రను విడగొట్టి విశాఖ పట్టణం, విజయవాడ రాజధాని అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన పక్షంలో సీమాంధ్రలో కర్నూలును రాజధాని చేయాలన్నారు. సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకున్న సమయంలో . ఇప్పటి వరకూ కలిసి ఉన్న రాష్ట్రాన్ని ఏ రకంగా విభజిస్తారంటూ ప్రజలు రోడ్డు మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేతలు కూడా తమ ప్రజలకు అనుగుణంగా నడుచుకోక తప్పడంలేదు. ఆ ప్రాంత నేతలంతా ఢిల్లీ బాటపట్టారు. సీమాంధ్రలో చోటు చేసుకున్నగందరగోళ పరిస్థితులను కేంద్ర పెద్దలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. -
బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కొత్తపార్టీ
రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావం తిరుపతి, న్యూస్‌లైన్: రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో గురువారం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా బెరైడ్డి మాట్లాడుతూ ఎక్కడి నుంచో వచ్చిన తెల్లదొరసాని నలుగురు పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను వెంటపెట్టుకుని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడి రాజకీయ దొంగలేమో తమ జిల్లాను తెలంగాణ లో కలపాలంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఆవిర్భావ సభకు రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీలో క్రియాశీలక పాత్ర పోషించే భూమన్, దశరథరామిరెడ్డి, వెంకటశివారెడ్డి, ఎన్వి రమణారెడ్డి, శరత్ చంద్రారెడ్డి హాజరుకాకపోవడం గమనార్హం. -
ఆత్మ గౌరవ దీక్ష చేపట్టిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి