
బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కొత్తపార్టీ
రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావం
తిరుపతి, న్యూస్‌లైన్: రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో గురువారం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా బెరైడ్డి మాట్లాడుతూ ఎక్కడి నుంచో వచ్చిన తెల్లదొరసాని నలుగురు పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను వెంటపెట్టుకుని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడి రాజకీయ దొంగలేమో తమ జిల్లాను తెలంగాణ లో కలపాలంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఆవిర్భావ సభకు రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీలో క్రియాశీలక పాత్ర పోషించే భూమన్, దశరథరామిరెడ్డి, వెంకటశివారెడ్డి, ఎన్‌వి రమణారెడ్డి, శరత్ చంద్రారెడ్డి హాజరుకాకపోవడం గమనార్హం.