కాలువ సామర్థ్యం 6,300 క్యూసెక్కులకు పెంచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
రూ.6,182.20 కోట్లతో చేపట్టిన పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్
ప్రధాన కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులే
హంద్రీ–నీవా, దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు 65 టీఎంసీలు అవసరం.. ఆ మేరకు నీటి సరఫరా కోసం 196 రోజులు ఎత్తిపోయాలి
అయితే శ్రీశైలానికి అన్ని రోజులు వరద ఉండదు.. ప్రాజెక్టులో నీళ్లూ ఉండవు.. ఏపీ, తెలంగాణలు 811 టీఎంసీలు వాడుకున్నాకే హంద్రీ–నీవాకు నీరు
సాక్షి, అమరావతి : దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. సీమకు కల్పతరవు వంటి హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేసింది. ప్రధాన కాలువ ప్రవా హ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమితం చేసింది. తద్వారా సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తా గు నీటికీ తల్లడిల్లాల్సిన దుస్థితిలోకి సీమ ప్రజలను నె ట్టింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజులపాటు 3,850 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోస్తేనే హంద్రీ–నీవా ద్వారా సీమకు 40 టీఎంసీలు అందించవచ్చు. హంద్రీ–నీవాపై ఆధారపడి చేపట్టిన భైరవా నితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, 68 చెరువుల పథకం, కర్నూలు నగరానికి తాగు నీటి కోసం గాజులదిన్నెకు 3 టీఎంసీల తరలింపు.. తదితర ప్రాజెక్టులకు మరో 25 టీఎంసీలు అవసరమని ప్రభుత్వమే తేల్చింది.
అంటే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 65 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఇందుకోసం శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 196 రోజులు ఎత్తిపోయాలి. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టులో అన్ని రోజులు వరద ప్రవాహం, నిల్వ ఉండదు. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–1 తీర్పు అమల్లో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు 811 టీఎంసీల నికర జలాలను వినియోగించుకున్న తర్వాతే హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేస్తామని ఇటీవల బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 2,578 టీఎంసీలను పూర్తిగా వాడుకున్న తర్వాతే హంద్రీ–నీవాకు మిగులు జలాలను విడుదల చేస్తామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రానున్న సంవత్సరాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవాకు నీటిని ఎత్తిపోసేందుకు అవకాశమే ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవకాశం ఉన్న రోజుల్లో కూడా కేవలం 3,850 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోయడం వల్ల కనిష్ట స్థాయిలో మాత్రమే హంద్రీ–నీవాకు నీటిని తరలించే పరిస్థితి ఉంటుందని తేల్చి చెబుతున్నారు.
తెలంగాణ దోపిడీ..
ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్నడూ లేని రీతిలో జూన్ నుంచి ఇప్పటి వరకు 1,575.62 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చింది. జూన్ 2న శ్రీశైలం ప్రాజెక్టులో 806.2 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నప్పుడే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటి తరలింపును ప్రారంభిస్తే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఆగస్టు 2 నుంచి హంద్రీ–నీవాకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించింది.
రోజుకు కనిష్టంగా 253 నుంచి గరిష్టంగా 1,695 క్యూసె క్కుల చొప్పున ఎత్తిపోయడం వల్ల ఆగస్టు 2 నుంచి బు« దవారం వరకు అంటే 152 రోజుల్లో కేవలం 19.65 టీ ఎంసీలను మాత్రమే తరలించగలిగింది. శ్రీశైలం ప్రా జెక్టులో ఏడాదికి 33 టీఎంసీలు ఆవిర వుతాయి. అంటే.. ఆవిరయ్యే నీటిలో 59 శాతం మేర కూడా హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు తరలించలేదన్నది స్ప ష్టమవుతోంది.
ఎడమ గట్టు కేంద్రం నుంచి తెలంగాణ జెన్‌కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రా జె క్టు నుంచి దిగువకు నీటిని తరలించేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులో ఇక ఎన్ని రోజులు నీరు నిల్వ ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దీన్ని బట్టి సీమ ప్రజలకు కూట మి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నది స్పష్టమవుతోంది.
తాగునీటికీ కష్టాలే.. పరిశ్రమలు మూతే
» శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలు తరలించి, రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టు చేపట్టారు. 2009 నాటికే తొలి దశ పనులు పూర్తవడంతో 2012 నుంచి నీటిని తరలిస్తున్నారు.
» 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పూర్తి సామర్థ్యం మేరకు హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, సీమను సస్యశ్యామలం చేసింది. గతంలో చంద్ర బాబు 2014–19 మధ్య అధికారంలో ఉన్న ప్పుడుగానీ, ఇప్పుడుగానీ హంద్రీ–నీవా సా మ ర్థ్యం మేరకు నీటిని తరలించిన దాఖలాలు లేవు.
» వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే రోజులు తగ్గడం వల్ల కృష్ణా నుంచి శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసి పట్టి.. హంద్రీ–నీవా నుంచి తరలించే ఎత్తిపోతలు, ప్రధా న కాలువ (–4.806 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టేందుకు రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు.
» కాలువలో నీటి ప్రవాహం లేనప్పుడు కాంట్రాక్టర్లు పనులు చేపడుతున్నారు. రోజుకు 6,300 క్యూసెక్కుల చొప్పున 120 రోజులు తరలిస్తేనే హంద్రీ–నీవా, దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు 65 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది.
కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమతం చేయడం.. బ్రిజేష్‌కు మార్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే సీమలో 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందే అవకాశమే లేదని, గుక్కెడు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కియా వంటి పరిశ్రమల అవసరాలకు నీటి లభ్యత ఉండదని, ఇది సీమలో ఉపాధి అవకాశాలను మరింత దెబ్బ తీస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment