Rayalaseema Farmers Fires With Chandrababu Naidu Ruling - Sakshi
Sakshi News home page

ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నావు చంద్రబాబూ!? 

Published Tue, Aug 1 2023 5:54 AM | Last Updated on Tue, Aug 1 2023 4:32 PM

Rayalaseema farmers fires with Chandrababu Ruling - Sakshi

రాష్ట్రంలో 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వెలగబెట్టింటి ఏమీ లేకపోగా, పోజులివ్వడానికి మాత్రం ఎప్పుడూ ముందుంటారు. ఇతరులు చేసిన పనులను సైతం నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడంలో ఈ పెద్దమనిషిది అందె వేసిన చేయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే గుడ్లురిమి చూడటం, ‘పచ్చ’ మూక/మీడియాతో ఎదురు దాడి చేయించడం ఆయన గారికి మంచి నీళ్లు తాగినంత సులువు. రాయలసీమలో పుట్టి ఆ ప్రాంతానికే వెన్నుపోటు పొడవడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. ఓటుకు కోట్లు కేసుకు జడిసి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఆ తప్పిదాన్ని సరిచేస్తుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. తగుదునమ్మా అంటూ ఇప్పుడు ‘సీమ’ ప్రాజెక్టుల వద్ద ఫొటో సెషన్‌కు బయలుదేరారు. ఇలా ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నావు చంద్రబాబూ!? 

దేశంలోనే తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను మళ్లించకుండా నాడు చంద్రబాబు ద్రోహం చేయగా, నేడు గరిష్టంగా ఒడిసిపట్టి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధి చాటుకుంటున్నారని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతిలో పూర్తి సామర్థ్యం మేరకు నీటి తరలింపు పనులను పూర్తి చేయడంతోపాటు తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు, అవుకు రిజర్వాయర్లు,  గాలేరు–నగరిలో భాగమైన గండికోట, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండలతోపాటు చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని ఇప్పటికే పూర్తి చేయగా రెండో సొరంగం కూడా దాదాపుగా పూర్తి అయింది.

నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను తరలించడం ద్వారా ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీలకు హక్కుగా దక్కిన జలాలను వాడుకోవడం కోసం రాయలసీమ ఎత్తిపోతలను సీఎం వైఎస్‌ జగన్‌ చేపడితే దానిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారని రైతులు మండిపడుతున్నారు.

శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన చోట కొత్త ప్రాజెక్టులను నిర్మిం చడం కోసం రాయలసీమ కరవు నివారణ పథకం కింద సీఎం జగన్‌ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం గుర్తించేలా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్‌ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. 

గాలేరు–నగరి సుజల స్రవంతి
శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 1.55, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షలకు సాగునీరు, ఐదు లక్షల మందికి తాగునీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయ/æ్ఞంలో భాగంగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాళెం, వామికొండ, సర్వారాయసాగర్‌ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు.

నాడు అలా... 

  • 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద తవ్వాల్సిన జంట సొరంగాల్లో ఫాల్ట్‌ జోన్‌(పెలుసుమట్టి)లో 165 మీటర్ల మేర మాత్రమే పనులు చేయాలి. వాటిని చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక సొరంగానికి ఫాల్ట్‌ జోన్‌లో పనులు చేయకుండా కాలువ(లూప్‌)తో సరిపుచ్చారు. 
  • కమీషన్లు రావనే కారణంతో గాలేరు–నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు పునరావాసంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. దాంతో కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను పట్టించుకోలేదు. 
  • చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(పది టీఎంసీల సామర్థ్యం) నిర్వాసితులకు కూడా చంద్రబాబు పునరావాసం కలి్పంచలేదు. ఏటా కేవలం సగటున రెండు మూడు టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు. 

 నేడు ఇలా.. 

  • సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు అంటే పది వేల క్యూసెక్కులను తరలించేలా అభివృద్ధి చేయించారు.  రెండో సొరంగంలో ఫాల్ట్‌ జోన్‌లో మిగిలిపోయిన పనులను అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో పూర్తి చేశారు. ఇప్పుడు గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్‌ క్లియర్‌ చేశారు. శ్రీశైలానికి వరద వచి్చన 30 రోజుల్లోనే గాలేరు–నగరి కింద ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేలకు పెంచిన సీఎం జగన్‌ ఆ పనులను కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది. 
  •  గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పునరావాసం కలి్పంచడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో గండికోటలో ఏటా 26.85 టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించి.. రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (ఆరు టీఎంసీలు), వామికొండసాగర్‌(1.6 టీఎంసీలు), సర్వారాయసాగర్‌(3.06 టీఎంసీలు)లలోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. 
  • చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కలి్పంచడం ద్వారా పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో ఏటా పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతుల జీవితాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ వెలుగులు నింపారు. 

తెలుగు గంగ.. 
శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్‌ కడప(1.67 లక్షల ఎకరాలు), ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు) కలిపి మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది తెలుగుగంగ ప్రాజెక్టు ఉద్దేశం.   

నాడు అలా... 

  • పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఎస్సార్‌ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కలువ) ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు చేరే జలాల్లో 15 వేల క్యూసెక్కులను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌కు తరలించేలా 7.8 కి.మీ. పొడవున తవి్వన లింక్‌ కెనాల్‌కు లైనింగ్‌ చేయకపోవడం వల్ల 6 నుంచి 7 వేల క్యూసెక్కులను కూడా తరలించేందుకు వీలయ్యేది కాదు. దీంతో వెలిగోడు రిజ­ర్వాయర్‌(16.95 టీఎంసీలు) నిండేది కాదు. లింక్‌ కెనాల్‌కు లైనింగ్‌ చేసి పూర్తి సామర్థ్యంతో నీటిని తరలించడం ద్వారా వెలిగోడును సకాలంలో నింపాలన్న ఆలోచన కూడా 2014–19 మధ్య చంద్రబాబు చేయలేదు.  
  • వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి బ్రహ్మంసాగర్‌కు ఐదు వేల క్యూసెక్కులను తరలించేలా 42.566 కిమీల పొడవున తవి్వన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్‌ చేయకపోవడంతో 2 నుంచి 2,500 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి. బ్రహ్మంసాగర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు. మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి. తెలుగుంగ ప్రధాన కాలువకు లైనింగ్‌ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేసిన పాపాన పోలేదు. ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతులను దెబ్బతీశారు. 

 నేడు ఇలా.. 

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌ వరకూ లింక్‌ కెనాల్‌ను, వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి బ్రహ్మంసాగర్‌ వరకూ ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ కాలువల ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు నీటిని తరలించడానికి మార్గం సుగమం చేశారు. దీంతో 2019, 2020, 2021, 2022లో వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు. 

  •  బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్‌ వాల్‌ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వకు లైన్‌ క్లియర్‌ చేశారు.  2021–22 నుంచే  బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తూ రైతుల జీవన ప్రమాణాలను పెంచేలా సీఎం జగన్‌ కృషి చేశారు. 

హంద్రీ–నీవా సుజల స్రవంతి   
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. తన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి సింహ భాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్‌హౌస్‌ నిర్మించిన మహానేత వైఎస్‌.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా నీటిని తరలించేలా ముచ్చుమర్రి ఎత్తిపోతల 2007, ఆగస్టు 31న చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు.   

నాడు అలా.. 

  • విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22(ప్రైస్‌ ఎస్కలేషన్‌), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2017 జనవరి 3న జాతికి అంకితం చేసిన నాటి సీఎం చంద్రబాబు.. ఇది తన ఘనతే అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.  
  • హంద్రీ–నీవా అంతర్భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేందకు చేపట్టిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమే‹Ùకు కట్టబెట్టిన చంద్రబాబు.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. 
  • మహానేత వైఎస్‌ పూర్తి చేసిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా టీడీపీ హయాంలో ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా సీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేశారు. 

 నేడు ఇలా.. 

  • వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక.. శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. 
  • హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు.  
  • హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో మిగిలిన పనులను పూర్తి చేసి.. ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు.  ప్రతి ఏటా డిజైన్‌ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నారు. 

    రైతుల హక్కులు నాడు తాకట్టు.. నేడు పరిరక్షణ 
  • విభజన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తించింది. శ్రీశైలం నిర్వహణను ఆంధ్రప్రదేశ్‌కు, నాగార్జునసాగర్‌ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. తెలంగాణ సర్కార్‌ తన భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని ఏపీకి అప్పగించకుండా తన అధీనంలోనే ఉంచుకోవడంపాటు ఏపీ భూభాగంలోని నాగార్జునసాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను కూడా అ«దీనంలోకి తీసుకుంది. రాష్ట్ర హక్కులను హరించేలా తెలంగాణ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు.  
  • శ్రీశైలంలో నీటిమట్టం 796 అడుగుల్లో ఉన్నప్పుడే కష్ణా బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తిని ప్రారంభించి రోజూ 44 వేల క్యూసెక్కులను తరలిస్తున్న తెలంగాణ సర్కార్‌.. 800 అడుగుల నుంచి రోజూ 24,014 క్యూసెక్కలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, 802 అడుగుల నుంచి రోజూ 3200 క్యూసెక్కులు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచడంతోపాటు విభజన చట్టంలో లేని ఎస్సెల్సీసీ నుంచి 826 అడుగుల నుంచే రోజూ 4 వేల క్యూసెక్కులు తరలించే పనులను వేగవంతం చేసింది. 796–826 అడగుల మధ్య నీటి మట్టం ఉన్నప్పుడే రోజూ 6.5 టీఎంసీలు తరలించడానికి తెలంగాణ సిద్ధమైంది.  
  • శ్రీశైలంలో 834(మల్యాల), 795(ముచ్చుమర్రి) అడుగుల నుంచి హంద్రీ–నీవా ద్వారా రోజుకు 3850 క్యూసెక్కులు మాత్రమే తరలించే సామర్థ్యం ఏపీకి ఉంది. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 881 అడుగుల్లో నీటి మట్టం శ్రీశైలంలో ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. తెలంగాణ సర్కార్‌ రోజూ 6.5 టీఎంసీలను తోడేస్తే శ్రీశైలంలో నీటి మట్టం పెరగదు. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు నీళ్లందవు. ఓటుకు కోట్లు కేసుకు జడిసి బాబు నోరుమెదపలేదు.  
  • వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఇది  పూర్తయితే  తనకు భవిష్యత్‌ లేదని చంద్రబాబు  అడ్డంకులు సృష్టిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement