బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై దాడి, వాహనం ధ్వంసం
రాయలసీమ నేత, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డ్రైవర్ దురుసుగా ప్రవర్తించడంతో తిరుపతి సమీపంలోని వరదాయపాలెంలో స్థానికులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళుతున్న ఆటో సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఆటో డ్రైవర్ ను బైరెడ్డి డ్రైవర్ చితకబాదారు.
డ్రైవర్ పై దాడి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు బైరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్ ను స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. స్థానికులు జరిపిన దాడిలో బైరెడ్డి డ్రైవర్ కు తీవ్రగాయలైనట్టు సమాచారం. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిపైనా స్థానికులు దాడి చేసినట్టు తెలుస్తోంది.