
రాజధాని సీమలోనే ఉండాలి : బైరెడ్డి రాజశేఖర రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు రాజధాని ఎంపిక రాయలసీమనుంచే జరగాలని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్) విజ్ఞప్తి చేసింది. ఆర్‌పీఎస్ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇదే డిమాండ్‌తో ఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు బెరైడ్డి తెలిపారు.