ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైతే మూడు ముక్కలు చేయాల్సిందేనని బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చిన తరుణంలో ఆయన గురువారం రాష్ట్రపతిని కలిసి తమన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఒకవేళ విభజన అనివార్యమైతే రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన పరిస్థితుల్లో, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానిలు ఉండాలని తెలిపారు. సీమాంధ్రను విడగొట్టి విశాఖ పట్టణం, విజయవాడ రాజధాని అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన పక్షంలో సీమాంధ్రలో కర్నూలును రాజధాని చేయాలన్నారు.
సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకున్న సమయంలో . ఇప్పటి వరకూ కలిసి ఉన్న రాష్ట్రాన్ని ఏ రకంగా విభజిస్తారంటూ ప్రజలు రోడ్డు మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేతలు కూడా తమ ప్రజలకు అనుగుణంగా నడుచుకోక తప్పడంలేదు. ఆ ప్రాంత నేతలంతా ఢిల్లీ బాటపట్టారు. సీమాంధ్రలో చోటు చేసుకున్నగందరగోళ పరిస్థితులను కేంద్ర పెద్దలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.