జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుదాం
– బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పిలుపు
– వ్యవసాయానికి విరివిగా రుణాలు ఇవ్వాలని సూచన
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాను పారిశ్రామికహబ్‌గా అభివద్ధి చేసేందుకు బ్యాంకర్లు అన్ని విధాలా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌లో హాలులో శుక్రవారం నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అక్టోబర్ రెండో పక్షంలో అన్ని మండల కార్యాలయాల్లో పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడుతూ ఖరీఫ్‌లో రూ. 2790 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ. 2300 కోట్లు మాత్రమే పంపిణీ చేశారన్నారు. రబీ సీజన్ కూడా ప్రారంభమవుతున్న దష్ట్యా పంట రుణాల పంపిణీని ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు అన్ని బ్యాంకులు వెంటనే రుణ మంజూరు పత్రాలు ఇస్తే యూనిట్ల గ్రౌండింగ్‌కు అవకాశం ఉంటుందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆర్‌బీఐ అధికారి గణేష్, లీడీసీఎం నరసింహారావు, సిండికేట్ బ్యాంకు ఏజీఓం మహంతి, నాబార్డు డీడీఎం నగేష్‌కుమార్, ఎస్‌బీఐ, ఏపీజీబీ ఆర్‌ఎంలు రమేష్‌కుమార్, వీసీకే ప్రసాద్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.