ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో మరణాల నివారణ | district road safety meet collector | Sakshi
Sakshi News home page

ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో మరణాల నివారణ

Published Mon, Sep 26 2016 11:11 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

district road safety meet collector

జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్‌
కాకినాడ సిటీ :  రహదారులు, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ, పటిష్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అమలు ద్వారా రోడ్డు ప్రమాద మరణాలను నివారించాలని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్‌ కోర్టు హాలులో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులు, ఉప రహదారుల కూడళ్లలో జీబ్రా క్రాసింగ్‌లు, హెచ్చరిక బోర్డులు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.  విజయవాడ, విశాఖపట్నంలో ఆటోలు ఏడు వేలు మాత్రమే ఉండగా, రాజమండ్రిలో వీటి సంఖ్య 13వేలు, కాకినాడలో 18వేలు ఉందని, రోడ్లపై పెరిగిన రద్దీ, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల్లో ఇకపై కొత్తగా ఆటోలను అనుమతించకూడదని, పాతబడిన వాటిని తొలగిస్తూ ఆటోల సంఖ్యను ఏడువేలకు నియంత్రించాలని కమిటీ తీర్మానించింది. ప్రజలకు ప్రత్యామ్నాయంగా ముఖ్య రూట్లలో ఆర్టీసీ లేదా ప్రైవేట్‌ ఆపరేటర్ల ద్వారా బస్సు రవాణా వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు. ఎస్పీ ఎన్‌.రవిప్రకాష్, రాజమండ్రి అర్బన్‌ ఎస్పీ రాజకుమారి, రాజమండ్రి కార్పొరేషన్‌ కమిషనర్‌ విజయరామరాజు, ఇ¯Œæచార్జి ఉప రవాణా కమిషనర్‌ సిరి ఆనంద్, ఎన్‌హెచ్‌ విభాగం పీడీ జేసీహెచ్‌ వెంకటరత్నం, ఆర్‌డీఓలు, డీఎస్‌పీలు, ఆర్‌టీఓలు, ఎంవీఐలు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement