సాక్షి, పల్నాడు జిల్లా: అమరావతి మండలం మల్లాదిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సీసీరోడ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, సచివాలయాలు ద్వారా వేగంగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
చదవండి: ‘అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు’
మూడేళ్లలో విప్లవాత్మక మార్పు: అంబటి రాంబాబు
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, పులిచింతల నుంచి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా గురజాల, నరసరావుపేట ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఈ మూడేళ్ల పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చామన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలతో సుపరిపాలన అందిస్తున్నామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment