Telangana gold
-
‘సార్’ ఆశయ సాధనతోనే బంగారు తెలంగాణ
- అభివృద్ధికి కొర్రీలు పెడుతున్న చంద్రబాబునాయుడు - ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ నుంచి వెళ్లాల్సిందే.. - ప్రోసర్ జయశంకర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రులు జగదీష్‌రెడ్డి, తుమ్మల ఖమ్మం: ‘నిధులు, నీళ్లు, ఉద్యోగాలు.. తెలంగాణ ప్రాంత ప్రజలకు అందాలి.. ఇక్కడి ప్రజలు వలస వెళ్లకుండా సొంత ఊళ్లో సుఖసంతోషాలతో బతకాలి’ అని తపించిన తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తొలి, మలితరం ఉద్యమాలకు మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్‌సార్ ఆశయసాధనే బంగారు తెలంగాణ ఏర్పాటుకు కృషి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని బైపాస్‌రోడ్ ట్రాన్స్‌కో కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన గురువారం ఆవిష్కరించారు. తెలంగాణకు విద్యుత్ రాకుండా సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలుపుకుని కుట్ర పన్నారని, ప్రైవేట్విద్యుత్ ఉత్పత్తిదారులను కూడా బెదిరించి తెలంగాణను అంధకారం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నించారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బాబు కుట్రలను తిప్పి కొట్టి విద్యుత్ కోతలు లేని తెలంగాణను చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. జయశంకర్ సార్ ఆశయసాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కృష్ణ, గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించేం దుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. బాధలు లేని బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ తో పోటీ పడలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ రాజకీయాలు, ఇతర విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని ఆటంక పరిచేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రజల దీవెన ఉన్నంత వరకు ఎవరూ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహాన్ని జిల్లాలో ఆవిష్కరించడం అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఏపీ ఉద్యోగులు వారి ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని, తెలంగాణ బిడ్డలకే ఇక్కడ ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ట్రాన్స్‌కో సీఎండీ వెంకటనారాయణ, ఎస్ఈ ధన్సింగ్, ఉద్యోగులు తిరుపతి, రామకృష్ణ, బాబూనాయక్, రాధాకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం.. రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి హామీ ఇచ్చా రు. గురువారం రామకృష్ణ ఫంక్షన్‌హాలు లో జరిగిన తెలంగాణ విద్యుత్ కార్మికసంఘం జిల్లా మహాసభలకు ఆయన హాజరై ప్రసంగించారు. విద్యుత్ కోతలు లేని తెలంగాణ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా వెచ్చించేం దుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో అత్యధికంగా విద్యుత్ శాఖలోనే ఉద్యోగా లు భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవర్దన్, నాగయ్య, మూర్తి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు పాల్గొన్నారు. -
ప్రతిదీ రాజకీయకోణంలో చూడొద్దు
సూర్యాపేటరూరల్ : ప్రతిదీ రాజకీయకోణంలో చూడొద్దని, ఉద్యమంలో జెతైలంగాణ అన్న ప్రతి బిడ్డ, ఉద్యమకారుడు, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేలా ఉండాలని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యంలోని సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద గల సెవెన్ ఆర్ హోటల్లో కాసేపు ఆగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలనే ఆలోచనలో కేసీఆర్ నాయకత్వంలో బడ్జెట్‌ను రూపొందించి సభలో ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. ఎస్సీ వర్గీకణ బిల్లునూ ఆమోదించామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కేవలం హైదరాబాద్ నగరం పరిధిలో ఉన్న ఆస్పత్రులకే బేసిడ్ బడ్జెట్ రూ.582 కోట్లు, ఏరియా ఆస్పత్రి ఒక్కంటికి కోటి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆప్గ్రేడ్కు రూ.30 కోట్లు కేటాయిం చినట్లు వివరించారు. జిల్లా కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చేందుకు జిల్లాకు రూ.పది కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్ర తి తెలంగాణ బిడ్డ, ఉద్యమకారుడు, అభిమానులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల న్నారు. ఉషామోహ్రా కమిటీ కేంద్రం ఆధీనంలో ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కమల్‌నాథ్ కమిటీ సిఫారసుల మేరకు వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఆయనకు టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, చినశ్రీరాములు, ఎర్రవీరస్వామిమాదిగ, తూడి నర్సింహారావుతోపాటు వైద్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ నిర్మిద్దాం
ఉప్పునుంతల/అమ్రాబాద్: రాష్ట్ర ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. రాష్టానికి దక్కాల్సిన 54 శాతం విద్యుత్‌వాటా అందకపోవడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమిస్తామన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పునుంతల వె ల్టూరు గ్రామరైతు మధన్‌మోహన్‌రెడ్డి పొలంలో ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ.. ఆంధ్రా పా లకులు విభజన ఒప్పందాలను ఉల్లఘించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీచేశారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే బ్యాంకులకు రూ.4250 కోట్లు బ్యాంకులకు చెల్లించి మిగతా డబ్బులకు హామీఇచ్చినట్లు తెలిపారు. ఐదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోరుునా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 480 కోట్ల పంట నష్టపరిహారం అందించామన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు సెరికల్చర్, హార్టికల్చర్, గ్రీన్కల్చర్కు 75 శాతం సబ్సిడీని అందిస్తున్నామని, ఇందుకోసం బడ్జెట్లో రూ. 200కోట్లు కేటాయించినట్లు చెప్పారు. సోలార్ విద్యుదుత్పత్తిని ప్రోత్సహించి మొదటగా 20వేల పంపుసెట్లు సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 45వేల చెరువులుండగా, ఈ ఏడాది 9వేల గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూ. రెండువేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించి రైతులు ఆర్థికాభివృద్ధ్ది సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మె ల్యే గువ్వల బాల్‌రాజు, జేడీఏ భగవత్ స్వరూప్, ఏడీఏ సరళకుమారి, ఆర్డీఓ వీరారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా తదితరులు పాల్గొన్నారు. మిగులు విద్యుత్‌ను సాధిస్తాం 60 ఏళ్ల ఆకాంక్ష.. 14ఏళ్ల పోరాటం.. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ కల సకారమైందని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం రాజయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమ్రాబాద్‌కు వచ్చిన ఆయన ఇప్పలపల్లి గ్రామంలో రూ.రెండుకోట్ల వ్యయంతో నూతనంగా నిర్మంచిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలన అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్‌ను సాధిస్తామన్నారు. దీంతో రైతాంగానికి ఏడు గంటల విద్యుత్‌ను తప్పకుండా ఇచ్చి తీరుతామన్నారు. బడు గు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులందరికీ ఆసరా, కల్యాణలక్ష్మి పథకాలను వర్తింపజేస్తామని, ఆహార భద్రతాకార్డులు అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, ఇతర ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.