వాటికి అమెరికా వెబ్‌సైట్ జాబితాలో చోటు
న్యూయార్క్: భారత్‌లో జరిగే దీపావళి పండగ, కుంభమేళాలు ప్రపంచంలో తప్పనిసరిగా పాల్గొనదగ్గ ఉత్సవాలని అమెరికాకు చెందిన న్యూస్‌వెబ్‌సైట్ హఫింగ్టన్‌పోస్ట్ వెల్లడించింది. ఈ వెబ్‌సైట్ రూపొందించిన తప్పనిసరిగా పాల్గొనదగ్గ ఉత్సవాల జాబితాలో ఈ రెండు ఉత్సవాలకు చోటు లభించింది. దీపాల వెలుగులు, బాణసంచా.., మిఠాయిలు, లక్ష్మీ పూజలతో దీపావళి పండగ ఎంతో ఆకట్టుకునేలా ఉంటుందని, అలాగే లక్షలాదిమంది పాల్గొనే కుంభమేళా కూడా శాంతియుతంగా సాగే అతిపెద్ద ఉత్సవమని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనదగ్గ ఇతర ఉత్సవాల్లో బ్రెజిల్‌లోని రియో డిజెనేరియోలో జరిగే కార్నివాల్, జర్మనీలో జరిగే బీర్ ఫెస్టివల్, స్పెయిన్‌లో జరిగే టమాటాల ఉత్సవం ఉన్నట్టు వెల్లడించింది.
దీపావళి, కుంభమేళా భలే..భలే
Published Fri, Dec 6 2013 5:55 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
Advertisement
Advertisement