సిక్కోలు జిల్లా దీపావళి సందడికి దూరమైంది. హుదూద్ తుపాను ధాటికి పంటలన్నీ నాశనమయ్యూయి. రైతులు, మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపే సమయంలో చీకట్లు అలముకున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు నింగిని తాకుతున్నాయి. తిండికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. ఫలితం.. చాలా పల్లెల్లో పిండి వంటల ఘమఘమలు, మహిళల హడావుడి కానరావడం లేదు. మరోవైపు ప్రభుత్వం దీపావళి పండుగను నిషేధించడంతో బాణసంచా విక్రయూలు పూర్తిగా నిలిచిపోయూయి.
పాలకొండ రూరల్: నరకాసురునిపై యుద్ధం సాగించి విజయానికి కారకమైన మహిళా శక్తికి నిదర్శనంగా సాగే దీపావళి ఇంటిల్లిపాదికీ ఇష్టమైన పండుగ. దివ్వెల పండుగ. దుష్టసంహారానికి ప్రతీకగా జరుపుకునేది. సమాజంలోని చీకటిని తొలగించి ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేదే దీపావళి. అయితే, ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో విలవిల్లాడుతున్న జిల్లా వాసులు పండుగకు దూరమయ్యూరు.
పేలని టపాసులు...
దీపావళి పండగ ప్రాధాన్యత పక్కన పెడితే బాణసంచా ధరలు నింగినంటాయి. ఈ ఏడాది బాణసంచా దుకాణాలు పూర్తిగా లేకపోవడం, ఇటీవల తయారీ కేంద్రాల్లో జరిగిన అగ్నిప్రమాదాలు కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, నిబంధనలు విధించడంతో శ్రీకాకుళం, పాలకొండ, రాజాం వంటి ముఖ్య పట్టణాల్లో కూడా లెసైన్స్ ఉన్న బాణసంచా దుకాణాలు లేని పరిస్థితి నెలకొంది. దీంతో చిన్నపాటి మందుగుండు సామాగ్రి కూడా కొనుక్కొనేందుకు వీలు లేకుండాపోయింది. అడపా దడపా అమ్ముతున్నా ధరలు ఆకాశాన్నంటుతున్నారుు.
మార్వాడీల్లో దీపావళి కళ
శ్రీకాకుళం కల్చరల్: దీపావళి పండగకు వయుసుతో నిమిత్తం లేకుండా అందరూ ఆనందంగా చేసుకునే పండగ. దీపావళి అంటే దీపోత్సవం. ఆరోజన దీపలక్ష్మీ శత సహస్ర కిరణ కాంతులతో అమావాస్యనాటి అజ్నానపు చీకట్లను పారద్రోలి జగత్తును తేజోమయం చేసి, జ్ఞాన జ్యోతులు ప్రకాశింప చేస్తుంది. చీకటిపై వెలుతురు, అసత్యంపై సత్యం, విజయం సాధించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆశ్వీయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా వ్యవహరిస్తారు. మార్వాడీలు దీపావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వివిధ ఆకారాల దీపాలతో పండుగను జరుపుకొంటారు.
లక్ష్మీపూజలు
జిల్లాలో మార్వాడీ కుటుంబ సభ్యులు దీపావళి పండుగకు సిద్ధమవుతున్నారు. దీని కోసం తమ ఇళ్లను, షాపులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీపావళి రోజు సాయంత్రం షాపులలో, ఇళ్లవద్ద లక్ష్మీపూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మార్వాడీల సంఘం ప్రతినిధి ప్రదీప్ బిహాని మాట్లాడుతూ ఈరోజు నుంచి మా వ్యాపారానికి చెందిన లావాదేవీల అకౌంటు పుస్తకాలను ప్రారంభిస్తామని తెలిపారు. మా ఎదుగుదలకు కారణమైన లక్ష్మీదేవికి పూజలు చేస్తామని తెలిపారు.
దీపం అంతరార్థం
మన పూర్వీకులు దీప దర్శనానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ సంప్రదాయం భక్తి భావాలకు నెలవైన దీపావళి రోజున ఒక్కొక్క రకమైన ప్రమిదతో వెలిగిస్తే కోరికలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
బంగారు ప్రమిదను గోధుమలపై పెట్టి, నలువైపులా గులాబి రేకులు అలంకరించి స్వచ్చమైన
ఆవు నెయ్యితో వెలిగిస్తే ధన సమృద్ధి, బుద్ధి చాతుర్యం సిద్ధిస్తుంది.
వెండి ప్రమిదను బియ్యంపై ఉంచి చుట్టూ తెల్లగులాబీ అలంకరించి ఆవు
నెరుు్యతో దీపం వెలిగిస్తే ధనసంపద పెరుగుతుంది.
రాగి ప్రమిదను కందిపప్పుపై ఉంచి ఎర్రన్ని పూవురేకులతో అలంకరించి నువ్వుల నూనెతో వెలిగిస్తే మనోబలం కలిగి, అరిష్టం నశిస్తుంది.
పసుపురంగు పువ్వులు శనగ పప్పుపై ఉంచి నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానికి స్థిరత్వం కలుగుతుంది.
ఇనుప ప్రమిదను మినప పప్పుపై ఉంచి ముదురు నీలం రంగు పూలు
అలంకరించి పెడితే అరిష్టం నశిస్తుంది.
మట్టి ప్రమిదను సంధ్యాసమయంలో ఆవు నెరుు్యతో తులసి మొక్క వద్ద వెలిగిస్తే దుష్ట శక్తుల ప్రభావం పోతుంది.
నాలుగు వీధుల కూడలిలో దీపం పెడితే లాభం చేకూరుతుంది.
రావిచెట్టు కింద ఆవనూనెతో దీపం పెట్టడం వల్ల కోరికలు తీరుతాయి.
నువ్వుల నూనెతో 41రోజులు దీపం పెడితే దీర్ఘరోగాలు నయమవుతాయి.
అరిటి చెట్టుకింద ప్రతి గురువారం నెయ్యితో దీపం వెలిగిస్తే కన్యలకు వెంటనే వివాహం అవుతుందని నమ్మకం.
పవిత్రమైనది...
దీపావళి ఎంతో పవిత్రమైన పర్వది నం. కాలరాత్రికి దీపావ ళి. జగన్మాతకు మహాప్రీతిపాత్రమైన రోజులు దీపావళి అమావాస్య, మహాశివరాత్రి, కృష్ణాష్టమి. ఈ మూడింటిలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది దీపావళి. ప్రకృతి విపత్తులతో ప్రజలు పండుగకు దూరంకావడం విచారకరం.
- దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ, ప్రధాన అర్చకుడు,
కోటదుర్గమ్మ దేవస్థానం
పంటా లేదు.. పండుగా లేదు..
ఈ ఏడాది తుపానుతో దీపావళి చేసుకునే పరిస్థితి లేకుండా పోరుుంది. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా దీపావళి పండగ సంబరాలు చేసుకొనే పరిస్థితి ఎక్కడుంది.
- ఖండాపు ప్రసాదరావు,
అభ్యుదయ రైతు
సిక్కోల్లో చీకట్లే..!
Published Thu, Oct 23 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM
Advertisement
Advertisement