
పండుగల సీజన్ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ పేరిట ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి 31వరకు కొనసాగనున్న తాజా ఆఫర్‌లో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్ వంటి ఎల్రక్టానిక్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్ ఉండగా.. విడిభాగాలపైమరో 10 శాతం డిస్కౌంట్ ఉన్నట్లు వెల్లడించింది. లక్కీ కస్టమర్లకు కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, ఐ–ఫోన్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆఫర్ కాలంలో మై జియో స్టోర్స్‌లో వోచర్లను సైతం అందిస్తున్నట్లు తెలిపింది.