
దీపపు కాంతులతో కూడిన పూల పరిమళాలు దీపావళి అందాన్ని పెంచి ఆనందం మిన్నంటేలా చేస్తాయి. పండుగరోజు ఇంటి అలంకరణలు చేయడం సాధారణమే కాని దానికి కొంచెం కళాత్మకత జోడిస్తే దీపావళి రోజు ఇల్లు గ్రాండ్ లుక్‌తో అదిరిపోతుంది. ఈ సరికొత్త అలంకరణ ఐడియాలపై ఒక లుక్...
1. దీపావళి అంటే తీపి లేకుండా జరగదు కదా! కుటుంబ సభ్యులందరూ కలసి తీపిని పంచుకునే డైనింగ్ టేబుల్ అలంకరణ ఇలా ఉంటే...
2. ఈ అలంకరణకు సమయం ఎక్కువే పట్టొచ్చు కాని మీ ఇంటి దీపావళిని ప్రత్యేకంగా మారుస్తుందనడంలో సందేహం లేదు.
3. చూడటానికి హాయిగా ఎంత బావుందో కదా! శ్రద్ధ తీసుకుని చేసే ఈమాత్రం చిన్న అలంకరణ చాలు ఇంటికి అద్భుతమైన అందం చేకూరడానికి!
4. వివిధ ఆకారాల్లో ఉండే వేలాడే దీపాలంకరణకు పూల సొబగులు అద్దితే కనులకు భలే విందు!
5. చూడటానికి ఎటువంటి హడావిడి లేకున్నా ప్రశాంతమైన భావనను కలిగించాలంటే అరటాకులలో దీపాలు పరిచి ఆహ్లాద దీపావళిని ఆహ్వానించండి.
6. కాదేదీ అలంకరణకు అనర్హం. ఇంట్లో పడున్న వాటితోనూ అందం తేవొచ్చు. గోడ మీద బొమ్మను చిత్రించి చిన్న వెదురు తట్టల్లో దీపాలు పెట్టి ఇంట్లో ఉన్న నిచ్చెనకి పూల అలంకరణలు చేస్తే చాలు..