సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగర ప్రాంతంలో వర్షాలతో కాస్తంత తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..దీపావళి పండుగతో మళ్లీ విజృంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి మరీ ఢిల్లీ ప్రజలు టపాసులు కాల్చడంతో సోమవారం తెల్లవారుజాముకు వాయు నాణత్య సూచీ(ఏక్యూఐ)500 పాయింట్లకు చేరుకుంది. టపాసుల పొగకు మంచు తోడవ్వడంతో ఢిల్లీలోని రోడ్లన్నీ కాలుష్యంతో చీకట్లు కమ్ముకున్నాయి.
ఎదురుగా వస్తున్న సైతం వాహనాలు కనిపించని స్థాయికి వాయు కాలుష్యం చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హరియాణా, రాజస్థాన్, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలి్చవేతల కారణంగా ఢిల్లీ నగరం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పంట వ్యర్థాల దహనాన్ని ఆపేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది.
ఢిల్లీలో ఎటువంటి బాణసంచా కాల్చొద్దంటూ సూచనలు చేసింది. అయితే, ప్రజలు ఈ సూచనలను లెక్కచేయకుండా దీపావళి రోజు బాణసంచాను యథా ప్రకారంగా కాల్చేశారు. ఫలితంగా నగరంలోని చాలా చోట్ల వాయు నాణ్యత (ఏక్యూఐ) 500పైగా నమోదయింది. అక్కడక్కడా 900 వరకూ చేరడం గమనార్హం. సోమవారం ఉదయం 6 గంటలకు అత్యధికంగా లజ్‌పత్ నగర్‌లో 959, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతంలో 910, కరోల్ బాగ్ ప్రాంతంలో 779 వరకు నమోదైంది.
వాహనదారులపై 1, 93, 585 చలాన్ల జారీ
రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఈనెల 7న ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిరోజూ 3వేలకు పైగా వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 385 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నగర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు వివరించింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కాలుష్య ఉల్లంఘనలపై 1, 93, 585 చలాన్లు జారీ చేయగా..10 నుంచి 15ఏళ్ల నాటి 32 డీజిల్, పెట్రోల్ వాహనాలతోపాటు 15 ఏళ్ల కంటే పాతవైన మరో 14, 885 వాహనాలను సైతం సీజ్ చేసినట్లు న్యాయస్థానానికి సమరి్పంచిన నివేదికలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment