ఆయనకు ఫ్యాన్ అయిపోయాను : సమంత | I became pawan kalyan's fan, says samantha Ruthprabhu | Sakshi
Sakshi News home page

ఆయనకు ఫ్యాన్ అయిపోయాను : సమంత

Published Wed, Oct 2 2013 1:25 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఆయనకు ఫ్యాన్ అయిపోయాను : సమంత - Sakshi

ఆయనకు ఫ్యాన్ అయిపోయాను : సమంత

 ఏమాయ చేశావె, బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది... అన్నీ ఒకదాన్ని మించి ఒకటి హిట్టు. ఇప్పుడున్న ఏ కథానాయికకూ లేని ట్రాక్ రికార్డ్ ఇది. తాజా సంచలనం ‘అత్తారింటికి దారేది’తో కథానాయికగా సమంత సెంటిమెంట్ మరింత బలపడింది.
 
 ‘ఓ మోస్తరు బడ్జెట్ చిత్రాలు మీకు కలిసి రావేమో!’ అని ‘ఎటోవెళ్లిపోయింది మనసు’, ‘జబర్దస్త్’ చిత్రాలను దృష్టిలో పెట్టుకొని విలేకరులంటే -‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది. ‘జబర్దస్త్’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రాలు బాగా ఆడి ఉంటే... కచ్చితంగా వాటిని పెద్ద సినిమాలనే అనేవారు. అవి ఆడలేదు కాబట్టే మోస్తరు బడ్జెట్ చిత్రాలంటున్నారు.
 
 ఏదిఏమైనా... నేను నటించిన భారీ చిత్రాలన్నీ విజయాలను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘అత్తారింటికి దారేది’లో నేను చేసిన ‘శశి’ పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ పాత్ర ద్వారా కామెడీ కూడా చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాతో నేను పవన్‌సార్ ఫ్యాన్‌ని అయిపోయా. మళ్లీ ఆయనతో నటించాలని ఉంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement