టైమ్‌ ఫిక్స్‌ | Wedding muhurtham for Nithiin and Shalini has been fixed | Sakshi
Sakshi News home page

టైమ్‌ ఫిక్స్‌

Published Sun, Jul 19 2020 2:09 AM | Last Updated on Sun, Jul 19 2020 2:09 AM

Wedding muhurtham for Nithiin and Shalini has been fixed - Sakshi

షాలిని,‌ నితిన్

హీరో నితిన్‌ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరగనుంది. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఈ వివాహ వేడుకను ప్లాన్‌ చేస్తున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘రంగ్‌ దే’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో), ‘చెక్‌’ (చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో) చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు నితిన్‌. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్‌పేట’, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న హిందీ హిట్‌ ‘అంధాదూన్‌’  తెలుగు రీమేక్‌లో నితిన్‌ హీరోగా నటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement