muhurtam finalised
-
టైమ్ ఫిక్స్
హీరో నితిన్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరగనుంది. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఈ వివాహ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘రంగ్ దే’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో), ‘చెక్’ (చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో) చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు నితిన్. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్‌పేట’, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న హిందీ హిట్ ‘అంధాదూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తారు. -
ఆగస్టులో రామాలయం పనులు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం అయోధ్యలో సమావేశమై ముహూర్తం ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా శుక్రవారం అయోధ్య చేరుకున్నారు. ఆగస్టులో ఆలయ పనుల ప్రారంభంపై ప్రధాని ఆమోదించిన తేదీని ఈ సమావేశంలో ఆయన ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అయిన మిశ్రా వెంట నిపుణులైన ఇంజనీరింగ్ అధికారుల బృందం కూడా వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధికారులు ఆలయ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తారని సమాచారం. వచ్చే నెలలో రామాలయ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీతోపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ‘ఆలయ భూమి పూజ ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఇతర వర్చువల్ విధానాల్లో గానీ ప్రారంభించాలని సాధువులు కోరుకోవడం లేదు. ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమానికి రావాలని వారు భావిస్తున్నారు. నా ఆహ్వానాన్ని ప్రధాని ఆమోదిస్తారనే నమ్మకం ఉంది’అని గోపాల్ దాస్ అన్నారు. ఆగస్టులో ప్రధాని మోదీ అయోధ్య సందర్శనపై పీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేదు. -
పుష్కర ముహూర్తం ఖరారు
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం... ముహర్తం ఖరారుచేసింది. జూలై 14వ తేదీ ఉదయం గం 6.26ను ముహర్తంగా ఖరారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముహర్త సమయానికి అన్ని జిల్లాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున రాజమండ్రికి చేరుకునేలా ‘గోదావరి మహా పుష్కర శోభాయాత్ర’ నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. యాత్ర నిర్వహణ విధి విధానాల్ని ప్రకటించారు.