తొలిప్రేమలాగా 'చిన్నదాన నీకోసం' కూడా
తిరుమల : ఈ నెల 25న విడుదల కానున్న 'చిన్నదాన నీకోసం' సినిమా ప్రతిఒక్కర్నీ ఆలరిస్తుందని హీరో నితిన్ ధీమా వ్యక్తం చేశాడు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమని నిత్ తెలిపాడు. వచ్చే గురువారం సినిమా విడుదల సందర్భంగా.... నితిన్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. దర్శనాల విరామ సమయంలో అతను స్వామివారి సేవలో పాల్గొన్నాడు. అనంతరం అర్చకులు నితిన్‌ను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా చిత్ర విజయంపై ఇష్క్ హీరో ధీమా వ్యక్తం చేశారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవటం తనకు సెంటిమెంట్గా మారిందన్నాడు. తొలిప్రేమ చిత్రంలాగా 'చిన్నదాన నీకోసం' కూడా అందర్ని ఆకట్టుకుంటుందన్నాడు. ప్యూర్ లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలిపాడు. గత రెండు సినిమాల్లో పాటలు పాడిన... తాను ఈ చిత్రంలో పాట పాడలేదని...విలేకర్ల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇక 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా నితిన్తో ఫోటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు.