
ప్రముఖ హీరోకు పుత్రోత్సాహం..
తమిళ ప్రముఖ నటుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితడయిన అజిత్ మరోసారి తండ్రిగా ప్రమోషన్ కొట్టేశారు. ఆయన భార్య షాలిని సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 1999లో 'అమర్కాలం' అనే చిత్ర షూటింగ్లో పరిచయం అయిన అజిత్, షాలినీ అనంతరం ప్రేమలోపడి 2000లో పెళ్లి చేసుకున్నారు.
ఇప్పటికే వారికి ఏడేండ్ల పాప కూడా ఉంది. ఆమె పేరు అనౌష్క. ఇటీవలే తాను నటించిన 'యెన్నై అరిందల్' అనే చిత్రం ఘన విజయం సాధించడంతో చాలా హుషారుగా ఉన్న అజిత్ ఇప్పుడు తనకు కుమారుడు జన్మించడంతో పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.