క్షణ క్షణం ఉత్కంఠ | shalini movie songs cd released by venugopala chari | Sakshi
Sakshi News home page

క్షణ క్షణం ఉత్కంఠ

Published Sun, Apr 9 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

క్షణ క్షణం ఉత్కంఠ

క్షణ క్షణం ఉత్కంఠ

‘‘ఈ సినిమా పాటలు బాగున్నాయి. చిన్న సినిమాలు ఎక్కువగా రావాలి. అప్పుడే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 2000 ఎకరాల్లో ప్రభుత్వం ఫిలిం సిటీ నిర్మించనుంది’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు.

అమోఘ్‌ దేశపతి, అర్చన, శ్రేయా వ్యాస్‌ ముఖ్య పాత్రల్లో షెరాజ్‌ దర్శకత్వంలో పీవీ సత్యనారాయణ నిర్మించిన సినిమా ‘షాలిని’. నవనీత్‌ చారీ స్వరపరచిన పాటల సీడీలను వేణుగోపాలాచారి విడుదల చేశారు. చిత్ర సమర్పకుడు సాయి వెంకట్‌ మాట్లాడుతూ – ‘‘హారర్, థ్రిల్లర్, లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమా చూశాకా, విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. షేరాజ్‌తో ఓ భారీ బడ్జెట్‌ సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు క్షణ క్షణం ఉత్కంఠ కలిగించే చిత్రమిది. హైదరాబాద్, వైజాగ్, గోవాలో షూటింగ్‌ చేశాం’’ అన్నారు షెరాజ్‌. ఆర్కే గౌడ్, పీవీ సత్యనారాయణ, అమోఘ్‌ దేశపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement