అజిత్ వారసుడి పేరేంటో తెలుసా! | actor Ajith's son named Aadvik | Sakshi
Sakshi News home page

అజిత్ వారసుడి పేరేంటో తెలుసా!

Published Fri, Apr 24 2015 9:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

అజిత్ వారసుడి పేరేంటో తెలుసా!

అజిత్ వారసుడి పేరేంటో తెలుసా!

నటుడు అజిత్, షాలిని దంపతులకు ఇటీవల వారసుడు పుట్టిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటలో అన్యోన్యంగా జీవిస్తున్న వారిలో అజిత్, షాలిని దంపతులున్నారు. 1999లో 'అమర్కాలం' అనే చిత్ర షూటింగ్లో పరిచయం అయిన అజిత్, షాలినీ అనంతరం ప్రేమలోపడి 2000లో పెళ్లి చేసుకున్నారు.

 

ఇప్పటికే వీరికి 7 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆమె పేరు అనౌష్క.  కాగా మార్చి 2న షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బిడ్డకు పేరేమి పెడతారన్న ఆసక్తి అజిత్ అభిమానుల్లో నెలకొంది. వారందరి కోసం అజిత్  దంపతులు తమ వారసుడికిప్పుడు అద్వేక్ అనే పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.  

మరోవైపు ఇటీవలే తాను నటించిన 'యెన్నై అరిందల్' అనే చిత్రం ఘన విజయం సాధించడంతో చాలా హుషారుగా ఉన్న అజిత్ ఇప్పుడు తనకు కుమారుడు జన్మించడంతో పుత్రోత్సహంలో మునిగి తేలుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement