దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, ఫొటోలు వైరల్ | Shalini shares vacation pictures with Ajith Kumar | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, ఫొటోలు వైరల్

Published Wed, Mar 22 2023 11:26 AM | Last Updated on Wed, Mar 22 2023 11:26 AM

Shalini shares vacation pictures with Ajith Kumar - Sakshi

తమ చిత్రాలతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల  గల్లాపెట్టెలను నింపే నటుల్లో అజిత్‌ ఒకరు. అయితే ఈయన ఇతర నటులకు పూర్తిగా భిన్నం. చిత్ర పరిశ్రమకు చెందిన ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు. ఏ చిత్ర వేడుకల్లోనూ పాల్గొనరు. అసలు తన చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అజితే. తనూ, తన వృత్తి, ప్రవృత్తి, తన కుటుంబం అదే ఈయన లోకం. అందుకే విమర్శలు, వదంతులు అజిత్‌ దరిచేరవు. ఇక ఆయన జీవిత భాగస్వామి శాలిని గురించి చెప్పాలంటే ఈమె బాల్యంలో లిటిల్‌ సూపర్‌ స్టార్‌. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం  ఇలా పలు భాషల్లో నటించి తన నటనతో వావ్‌ అనిపించుకున్నారు.

 కథానాయకిగా కొన్ని చిత్రాల్లో నటించారు. అలా అద్భుతం అనే చిత్రంలో అజిత్‌తో జతకట్టారు. అప్పుడు వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత శాలిని నటనకు స్వస్తి పలికి కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. కాగా అందరిలాగా అజిత్‌ శాలిని దంపతులు తరచూ బయట ప్రపంచంలోకి రారు. అది నటుడు అజిత్‌కు ఇష్టం ఉండదు. తనకంటూ ఓ ప్రపంచాన్ని ఏర్పరచుకొని అందులోనే  తన సంతోషాన్ని వెతుక్కుంటారాయన. ఈయన నటన తర్వాత ఇష్టపడేది బైక్‌ రేస్‌. అలా స్టేట్‌ లెవెల్‌ బైక్‌ రేస్‌ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్నారు. 

ఇక విషయానికి వస్తే.. చాన్నళ్ల తర్వాత అజిత్, శాలిని దంపతులు విహారయాత్రలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అవును అజిత్‌ తన భార్య శాలినితో కలిసి ఇటీవల విహారయాత్ర కోసం దుబాయ్‌ వెళ్లారు. అక్కడ సముద్రంలో బోట్‌లో విహరిస్తున్న ఫోటోలు నెటిజన్లను చేతినిండా పని చెబుతున్నాయి. కాగా తుణివు చిత్రంతో భారీ హిట్‌ కొట్టిన అజిత్‌ త్వరలో తన 62వ చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement