Shalini Gave Special Birthday Gift To Ajith On His Birthday, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Actor Ajith Birthday Gift: అజిత్‌కి అదిరిపోయే బహుమతి ఇచ్చిన షాలిని

Published Wed, May 1 2024 11:10 AM | Last Updated on Wed, May 1 2024 6:09 PM

Shalini Gave Ducati Bike To Ajith On His Birth Day 2024

డై హార్డ్ ఫ్యాన్స్ ఉండే హీరోల్లో తలా అజిత్ ఒకడు. తమిళనాడులో ఇతడికి కోట్లాదిమంది అభిమానులున్నారు. తెలుగులోనూ ఇతడికి ఓ మాదిరి గుర్తింపు ఉంది. అడపాదడపా యాక్షన్ సినిమాలతో ఆకట్టుకునే ఇతడు ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. బుధవారం ఇతడి 53వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇతడి భార్య మాత్రం అదిరిపోయే గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసింది.

(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)

1990లోనే నటుడిగా కెరీర్ ప్రారంభించిన అజిత్.. 'ప్రేమ పుస్తకం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. తాజాగా బుధవారం అజిత్ 53వ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.

ఈ క్రమంలోనే అజిత్ భార్య షాలిని.. భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బైక్స్ అంటే అజిత్ ఎంత ఇష్టమో బాగా తెలిసిన షాలిని.. ఈ బర్త్ డే కానుకగా డుకాటీ బైక్ బహుమతిగా ఇచ్చింది. మార్కెట్‌లో దీని ధర రూ.10 లక్షలు పైమాటే. ఏదేమైనా ఇలా బైక్ ఇచ్చి పుట్టినరోజు సర్‌ప్రైజ్ చేయడం అజిత్ అభిమానులకు తెగ నచ్చేసింది. 

(ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement