అజిత్‌కు శుభాకాంక్షల వెల్లువ | Vijay's Fans Shower Blessings on Ajith-Shalini's Baby | Sakshi
Sakshi News home page

అజిత్‌కు శుభాకాంక్షల వెల్లువ

Published Wed, Mar 4 2015 2:32 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

అజిత్‌కు శుభాకాంక్షల వెల్లువ - Sakshi

అజిత్‌కు శుభాకాంక్షల వెల్లువ

 నటుడు అజిత్, శాలిని దంపతులకు వారసుడు పుట్టాడు. అజిత్, శాలినిలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. కాదలుక్కు మరియాదై చిత్రం ద్వారా కథా నాయికిగా పరిచయమైన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ శాలిని. 1999లో అమర్కలం చిత్రంలో అజిత్‌తో నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తింది. 2000లో పెళ్లి చేసుకున్నారు. 2008లో అమ్మా నాన్నగా ప్రమోషన్ పొందారు. శాలిని అప్పుడు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాపకు అనుష్క అని నామకరణం చేశారు. సుమారు ఏడేళ్ల తరువాత శాలిని సోమవారం వేకువజామున 4.30 గంటల సమయంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు.
 
 శుభాకాంక్షల వెల్లువ : తనకు వారసుడు పుట్టిన ఆనందంలో అజిత్ ఆస్పత్రికి సిబ్బంది, సన్నిహితులకు స్వీట్స్ పంచి పెట్టారు. అజిత్, శాలిని దంపతులకు చిత్ర పరిశ్రమల నుంచి అభినందనలు, వారి వారసుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండటం విశేషం. సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు నటీనటులు అజిత్ వారసుడికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు.

ఎవరెలా శుభాకాంక్షలు తెలిపారంటే..
 
 అజిత్, శాలినిలకు పుత్రరత్నం పుట్టినందుకు శుభాకాంక్షలు - ధనుష్.
 
 అజిత్, శాలినిలకు అభినందనలు చిన్నారి దేవుడికి (బాలలు భగవంతుడితో సమానం అంటారం) ఆశీస్సులు - జయంరవి
 
 కుట్టి తల వచ్చాడు అజిత్, శాలినిలకు శుభాకాంక్షలు - శివకార్తికేయన్
 
 అజిత్, శాలిని కుటుంబానికి శుభాభివందనాలు. ఆనంద భరిత రోజులొచ్చాయి - విక్రమ్ ప్రభు
 
 ఆదర్శ దంపతులు అజిత్, శాలినిలకు భగవంతుడు మరో బహుమతి నిచ్చాడు. .. నా శుభాకాంక్షలు - సంగీత దర్శకుడు
  హరీష్ జయరాజ్
 
 అజిత్‌సార్‌కు, శాలిని మేడమ్‌కు శుభాకాంక్షలు. చిన్న తలను స్వాగతిస్తున్నాం - దర్శకుడు వెంకట్ ప్రభు.
 
 కుట్టితల జయిస్తాడు - నటుడు ప్రేమ్‌జీ అమరన్
 
 అజిత్ సార్‌కు శాలిని మేడమ్‌కు ఆప్యాయ శుభాకాంక్షలు-బుల్లితలకు ఘనమైన ఆదరణ లభిస్తుంది- సి.ల.రాజ్
 
 అజిత్ సార్‌కు, శాలిని మేడమ్‌కు కుట్టి తల కారణంగా ప్రశాంతత, సంతోషం కలగాలి - సంగీత దర్శకుడు డి.ఇమాన్.
 
 వెల్‌కమ్ కుట్టి తల అజిత్ సార్‌కు, శాలిని మేడమ్‌కు శుభాకాంక్షలు - సంగీత దర్శకుడు అనిరుధ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement