Ajith Family Pics Goes Viral: తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం వలిమై మూవీ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా బోని కపూర్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన వలిమై తమిళనాట రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఇప్పటి వరకు వలిమై దాదాపు రూ. 130 కోట్ల నుంచి రూ. 140 కోట్ల వరకు వసూళ్లు చేసి ఉంటుందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. వలిమై బ్లాక్‌బస్టర్ హిట్‌తో అజిత్ ఫుల్ ఖుషిలో ఉన్నాడు. అదే జోష్‌లో కుమరుడు అద్విక్ బర్త్‌డేను కుటుంబంతో కలిసి గ్రాండ్‌తో సెలబ్రెట్ చేసుకున్నాడు అజిత్.
చదవండి: ఆమెతో నా భర్త వివాహేతర సంబంధం, విడాకులు: నటి భావోద్వేగం
ఇందుకోసం భార్య పిల్లలతో రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే హీరోగా అజిత్ ఎంత బిజీగా ఉన్న ఖాళీ సమయాన్ని ఎక్కువగా కుటుంబానికి వెచ్చిస్తాడు. అయితే ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ ముచ్చట్లను ఎక్కువగా ప్రస్తావించడు. ఈ నేపథ్యంలో తన కూతురు, కొడుకు ఫొటోలు కానీ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటకు రావడం చాలా అరుదు. ఈ క్రమంలో కొడుకు బర్త్‌డే సెలబ్రెషన్‌లో భాగంగా భార్య శాలిని, కూతురు అనౌష్క, కుమారుడు అద్విత్‌తో కలిసి దిగిన ఫొటో ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటుంది.
చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్
ఇందులో ‘తల’ కుమారుడిని చూసి కుట్టి తల(జునియల్ తల) అంటూ ముద్దుగా పిలుచుకుంటున్న అజిత్ ఫ్యాన్స్. ఇదిలా ఈ ఫొటోలో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ చేసే మరో సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు పంచ కట్టు, తెల్ల జుట్టుతో ఉండే అజిత్ ఈ ఫొటోల ఫుల్ స్టైలిష్‌గా కనిపించాడు. పెద్ద గడ్డం, వైట్ హెయిర్ సూట్‌తో పాటు చెవి రింగ్ ధరించి తల గ్యాంగ్‌లీడర్‌లా కనిపించాడు. అజిత్ కొత్త లుక్‌ను చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు లేట్ చేయకుండ తల కొత్త సినిమా స్టార్ చేశాడని, ఇది ఆయన న్యూ ప్రాజెక్ట్‌లోని లుక్ అయ్యింటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment