షాలినితో పెళ్లి వద్దని అజిత్‌కు వార్నింగ్‌ ఇచ్చిన డైరెక్టర్‌! | Ramesh Khanna Warned Ajith to Not Marry Shalini | Sakshi
Sakshi News home page

Ajith: ప్రేమించిన షాలినిని పెళ్లి చేసుకోవద్దంటూ అజిత్‌కు దర్శకుడి వార్నింగ్‌!

Published Sat, Mar 4 2023 9:41 PM | Last Updated on Sat, Mar 4 2023 9:43 PM

Ramesh Khanna Warned Ajith to Not Marry Shalini - Sakshi

జనాలందరూ మీ గురించే మాట్లాడుతున్నారు, ఆ షాలినిని పట్టించుకోవద్దు అని చెప్పాడట. కానీ అప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉన్న విషయం రమేశ్‌కు తెలియదు. దీంతో మరో డైరెక్టర్‌ శరణ్‌..

కోలీవుడ్‌లోని ప్రముఖ జంటల్లో అజిత్‌ కుమార్‌-షాలిని ఒకరు. బాలనటిగా కెరీర్‌ మొదలుపెట్టిన షాలిని తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఈ క్రమంలో అమర్కలం(1999) మూవీలో తొలిసారిగా అజిత్‌తో జోడీ కట్టింది. నిజానికి ఈ సినిమా చేయడానికి మొదట షాలిని ఒప్పుకోలేదు. తాను చదువుకోవాలని కాబట్టి ఈ సినిమా చేయలేనని చెప్పేసింది. దీంతో నిర్మాతలు హీరోనే రంగంలోకి దిగమని సూచించారు.

అలా అజిత్‌ తనగురించి పరిచయం చేసుకుంటూ ఆమెతో కలిసి పనిచేయాలని ఉందంటూ చాలాసేపు తనను ఒప్పించే ప్రయత్నం చేసి చివరకు సఫలమయ్యాడు. ఈ సినిమా షూటింగ్‌లో అజిత్‌ అనుకోకుండా ఆమె మణికట్టుకు గాయం చేయడం, తరచూ తన పరిస్థితి గురించి ఆరా తీసే క్రమంలో ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సినిమా రిలీజైన మరుసటి ఏడాదే పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

అయితే అప్పట్లో అజిత్‌తకు షాలినిని పెళ్లి చేసుకోవద్దని సూచించాడట డైరెక్టర్‌ రమేశ్‌ ఖన్నా. జనాలందరూ మీ గురించే మాట్లాడుతున్నారు, ఆ షాలినిని పట్టించుకోవద్దు అని చెప్పాడట. కానీ అప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉన్న విషయం రమేశ్‌కు తెలియదు. దీంతో మరో డైరెక్టర్‌ శరణ్‌.. హీరోకే వార్నింగ్‌ ఇస్తున్నావు, తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి అని హెచ్చరించాడట. అప్పుడు కానీ రమేశ్‌కు వారు ప్రేమలో ఉన్నారని తెలిసిరాలేదు. 2000 సంవత్సరంలో ఏప్రిల్‌ 24న జరిగిన అజిత్‌ పెళ్లికి కూడా వెళ్లి దంపతులను ఆశీర్వదించాడు. ఇక పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement