12న పెళ్లి పనులు ఆరంభం | Nithin Wedding Works Starts From 12/07/2020 | Sakshi
Sakshi News home page

12న పెళ్లి పనులు ఆరంభం

Published Wed, Jul 1 2020 12:54 AM | Last Updated on Wed, Jul 1 2020 12:54 AM

Nithin Wedding Works Starts From 12/07/2020 - Sakshi

రెండేళ్ల క్రితం నితిన్‌ ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో నటించారు. ఆ సినిమాలో పెళ్లికి సంబంధించిన అన్ని వేడుకలు, పెళ్లి వేడుక ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది నితిన్‌ తన పెళ్లిని దాదాపు అంత ఘనంగా చేసుకోవాలనుకున్నారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అంటూ దుబాయ్‌ని వేదికగా ఎంపిక చేసుకున్నారు. ఏప్రిల్‌లో షాలినీతో దుబాయ్‌లో ఏడడుగులు వేయాలనుకున్నారు నితిన్‌. అయితే కరోనా కారణంగా ప్లాన్‌ మార్చారు. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఈ నెల నితిన్, షాలినీల వివాహం జరగనుంది. ఈ 12 నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టనున్నారు. ఈ నెల 20తో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఆ తర్వాత పెళ్లి తేదీని ఖరారు చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 50 మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement