ఆ నెలలోనే వరుణ్- లావణ్య పెళ్లి.. అతిథుల లిస్ట్‌లో టాలీవుడ్ జంట! | Nithiin and wife Shalini to attend Varun Tej and Lavanya Tripathi's wedding in Italy - Sakshi
Sakshi News home page

Varun Tej and Lavanya: వరుణ్-లావణ్య పెళ్లి.. హాజరు కానున్న టాలీవుడ్ జంట!

Aug 25 2023 8:54 PM | Updated on Aug 26 2023 10:53 AM

Nithiin and wife Shalini to attend Varun Tej and Lavanya Tripathi wedding - Sakshi

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేడుక మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి. ఇప్పటికే పెళ్లి తేదీపై చాలా ఇంటర్వ్యూల్లో వరుణ్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. పెళ్లి తేదీ ఇంకెప్పుడు ప్రకటిస్తారంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీని అమ్మ నిర్ణయిస్తుందని ఇటీవల ఓ ఇంటరాక్షన్‌ సందర్భంగా వరుణ్ తేజ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది నవంబర్ నెలలో వరుణ్-లావణ్య వివాహాం జరిగేలా కనిపిస్తోంది.

(ఇది చదవండి: మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!)

అయితే ఇప్పుడు వేదికతో పాటు ఈ పెళ్లికి హాజరయ్యే ప్రముఖుల ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది. వరుణ్, లావణ్యకు ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు, స్నేహితులు చాలామందే ఉన్నారు. అయితే వీరి పెళ్లి ఇటలీలో జరుగుతుందని ఇప్పటికే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథుల లిస్ట్‌లో హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పెళ్లిలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌తో పాటు ఇతర నటీనటులు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖుల గెస్ట్ లిస్ట్ గురించి మరిన్నీ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి వేదికతో పాటు తేదీ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ పెళ్లికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. 

కాగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 9న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్  ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. 

(ఇది చదవండి: లావణ్యకు కాల్ చేయను.. ఎందుకంటే.. వరుణ్ తేజ్ క్రేజీ ఆన్సర్! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement