హైదరాబాద్‌కు చేరుకున్న మెగా కోడలు.. ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం! | Varun Tej And Lavanya Tripathi Reached Hyderabad After Wedding In Italy | Sakshi
Sakshi News home page

Varun Tej and Lavanya Tripathi: భాగ్యనగరంలో నూతన వధూవరులు.. ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం!

Published Sat, Nov 4 2023 11:02 AM | Last Updated on Sat, Nov 4 2023 11:21 AM

Varun Tej and Lavanya Tripathi Off To Hyderabad After Italy Wedding - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.  ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ వీరిద్దరూ ఇటలీ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌తో వివాహాబంధంలో అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్, నితిన్ దంపతులు పాల్గొన్నారు. దాదాపు మూడు రోజుల పాటు టుస్కానీలో ఈ వేడుకలు జరిగాయి. ఈ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలను నెట్టింట తెగ వైరలయ్యాయి. 

(ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజే ఆ ప‌ర్స‌న‌ల్‌ ఫోటోలు లీక్ చేశాడు: ర‌తిక సోద‌రి)

అయితే తాజాగా ఈ జంట హైదరాబాద్‌కు చేరుకున్నారు. పెళ్లి వేడుకల అనంతరం తొలిసారిగా మెగా కోడలి హోదాలో లావణ్య త్రిపాఠి నగరంలో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన నూతన దంపతులకు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీరితో పాటే మెగాస్టార్ ఫ్యామిలీ, రామ్ చరణ్- ఉపాసన కూడా హైదరాబాద్ వచ్చేశారు. కాగా.. సినీ ప్రముఖుల కోసం ఈనెల 5న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. మాదాపూర్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement