కోలీవుడ్ హీరోయిన్ షాలిని చిన్నప్పటి నుంచి తన చురుకైన నటనతో అభిమానులను కట్టిపడేసింది. చిన్న వయసులోనే తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో బాలతారగా నటించిన షాలినిని బేబీ షాలిని అని ముద్దుగా పిలుచుకునేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కథానాయికగా వెలుగొందుతున్న షాలిని 1997లో విడుదలైన అనియతి ప్రవు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసింది. తమిళ్‌లో విజయ్ సరసన 'కాదలుక్కు మరియాధై' చిత్రంతో షాలిని తెరంగేట్రం చేసింది.
తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన షాలిని తమిళంలో తన తదుపరి చిత్రంలో అజిత్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అజిత్, షాలినీ కలిసి నటించిన తొలి సినిమా ‘అమర్‌కాలం’. శరణ్ దర్శకుడు. 1999 ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సినిమా విడుదలై విజయం సాధించడంతో వారి రొమాన్స్ కూడా అలాగే సాగింది.
ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన సఖి చిత్రంతో ఈ జోడీ మరింత పాపులర్ అయింది. సినీరంగంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో అదే ఏడాదిలో అజిత్- షాలిని వివాహం చేసుకున్నారు. అలా, 2001లో విడుదలైన ‘ప్రియద వరం వెండూమ్’ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. బాలనటిగా దక్షిణాదిలో రాణించి ఆపై టాప్ హీరోయిన్ స్థాయికి షాలినీ చేరుకుంది. అయితే, గత రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగానే ఉంది.
అలా సినిమా నుంచి తప్పుకున్న 23 ఏళ్ల తర్వాత కూడా శాలినికి సినిమా ఛాన్స్‌లు వచ్చాయి కానీ, సున్నితంగా వాటిని ఆమె తిరష్కరించింది. తన పిల్లలు అనుష్క (16), అద్విక్ (09) చదువు విషయంలో ఆమె ఎక్కువగా సమయం కేటాయిస్తుంది. తమిళంలో కేవలం 5 సినిమాల్లోనే షాలిని హీరోయిన్‌గా నటించినా.. ఆ కాలంలో రూ. 50 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. అజిత్, షాలినీల ఆస్తుల విలువ ఏకంగా రూ.300 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే తిరుగులేని హీరోయిన్‌గా కొనసాగిన షాలిని చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment