Hero Nithin Wife Shalini Birthday Celebrations | భార్య పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు - Sakshi
Sakshi News home page

నితిన్‌ భార్య బర్త్‌డే వేడుకలు

Published Fri, Jan 8 2021 1:41 PM | Last Updated on Fri, Jan 8 2021 4:10 PM

Nithin Wife Shalini Kandukuri Birthday Celebration - Sakshi

టాలీవుడ్‌ హీరో నితిన్‌ ఏకకాలంలో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంత బిజీబిజీగా ఉన్న సమయంలోనూ భార్య పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు. పైగా పెళ్లి తర్వాత షాలిని కందుకూరికి ఇదే తొలి బర్త్‌డే కావడంతో ఆమెకు ఏ లోటూ లేకుండా అన్నీ దగ్గరుండి పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి బంధుమిత్రులతో పాటు నటుడు వెన్నెల కిషోర్‌, దర్శకుడు వెంకీ కుడుముల సహా పలువురు సెలబ్రిటీలు విచ్చేశారు. ఈ బర్త్‌డేకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'నీతో గడిపిన క్షణాలు నా జీవితంలోనే అత్యంత మధురమైనవి' అంటూ నితిన్‌ షాలినితో దిగిన ఫొటోను షేర్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: 'వకీల్ సాబ్' టీజర్ టైమ్ ఫిక్స్)

ఇక ఈ మధ్యే నితిన్‌ దంపతులు తిరమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నితిన్‌ భార్యను కారులో కొండపైకి పంపించి ఆయన మాత్రం సామాన్య భక్తుల మాదిరిగా నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాగా జూలై 26న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నితిన్‌-షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ఎక్కువగా ఆహ్వానాలు పంపకపోవడంతో కొద్ది మంది సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. ఇక నితిన్‌ నటిస్తున్న 'రంగ్‌దే' చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు 'అంధాధున్‌' తెలుగు రీమేక్‌, చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో 'చెక్'‌ సినిమాల్లో నటిస్తున్నాడు. (చదవండి: ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. దీవించండి’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement