Hero Nithiin Wife Shalini Posted Funny Video Goes Viral - Sakshi
Sakshi News home page

సేఫ్‌గా లేనంటూ నితిన్‌ భార్య పోస్ట్‌.. వీడియో వైరల్‌

Published Fri, Nov 5 2021 6:39 PM | Last Updated on Sat, Nov 6 2021 1:49 PM

Nithiin Wife Shalini Posted Funny Video Goes Viral - Sakshi

దీపావళి పండగను టాలీవుడ్‌ సెలెబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు, స్పెషల్‌ వంకటకాలతో పాటు పటాసులు కాలుస్తూ ఎంజాయ్‌ చేశారు. ఆ ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్‌ హీరో నితిన్‌ భార్య షాలిని షేర్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలో షాలినిని గన్‌తో బెదిరిస్తున్నాడు నితిన్‌. అయితే అది నిజం గన్‌ కాదు. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకీ.

దీపావళి పండగవేళ.. నితిన్‌ చిన్నపిల్లలాడిలా బొమ్మ తుపాకీ చేతపట్టి ఇంట్లో హల్‌చల్‌ చేశారు. షాలినిని షూట్‌ చేయగా.. ఆ సౌండ్ కి ఆమె చెవులు మూసుకుంది. ఈ వీడియోని షాలిని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళీ.. కానీ నేను మాత్రం సేఫ్ గా లేననిపిస్తోంది’అని కామెంట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రంలో నటిస్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ శిష్యుడు ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. నితిన్ స‌ర‌స‌న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి న‌టిస్తుంది. ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement