అజిత్ ‘రియల్ హీరో’
మనసున్నవాడు, నిరాడంబరతకు చిరునామా అంటూ అజిత్‌ని కోలీవుడ్‌లో దాదాపు అందరూ అభినందిస్తుంటారు. కొంతమంది స్టార్ హీరోల్లా లేనిపోని బిల్డప్పులు ఇవ్వకుండా అందరితోనూ అజిత్ స్నేహంగా ఉంటారనే టాక్ ఉంది.
మనసున్నవాడు, నిరాడంబరతకు చిరునామా అంటూ అజిత్‌ని కోలీవుడ్‌లో దాదాపు అందరూ అభినందిస్తుంటారు. కొంతమంది స్టార్ హీరోల్లా లేనిపోని బిల్డప్పులు ఇవ్వకుండా అందరితోనూ అజిత్ స్నేహంగా ఉంటారనే టాక్ ఉంది.
అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారని, తన దగ్గర పని చేసేవాళ్లని బాగా చూసుకుంటారని కూడా కోలీవుడ్‌లో చెప్పుకుంటారు. ఇప్పుడు ఏకంగా తన స్టాఫ్ అందరికీ తలో ఇల్లూ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అజిత్. చిన్న చిన్న సాయాలు చేయడమే గొప్పగా ఫీలవుతున్న ఈ రోజుల్లో ఇల్లు కట్టివ్వడమంటే మాటలు కాదు.
పైగా ఒకరిద్దరికి కాదు... వంటమనిషి, తోటమాలి, డ్రైవర్... ఇలా మొత్తం పది మందికి అజిత్ ఈ స్వీట్‌షాక్ ఇవ్వబోతున్నారు. చెన్నయ్ శివార్లలో కొంత భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేశారు. ఇటీవలే శంకుస్థాపన కూడా జరిపారు.
అయితే షూటింగ్‌లో బిజీగా ఉండటంవల్ల ఈ కార్యక్రమంలో అజిత్ పాల్గొనలేకపోయారని, అందుకే ఆయన సతీమణి షాలిని పాల్గొన్నారని సమాచారం. ఇంకో విషయం ఏంటంటే, తమ అభిమాన నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయానికి అజిత్ అభిమానులు చాలా ఆనందపడుతున్నారట. ఎంతైనా మా అజిత్ ‘రియల్ హీరో’ అంటున్నారు.