
రూపం లేదు!
అమోఘ్ దేశపతి, అర్చన జంటగా షెరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షాలిని’. సాయి వెంకట్ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇటీవల ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ‘‘దెయ్యానికి ఒక రూపం ఉండదని చెప్పే చిత్రమిది. ఉత్కంఠ కలిగించే సీన్స్ చాలా ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు. ‘‘ఈ చిత్రం తర్వాత షెరాజ్‌తో భారీ బడ్జెట్ సినిమా తీస్తా’’ అన్నారు సాయి వెంకట్.