భయం!
అమోఘ్ దేశపతి, అర్చన, శ్రేయా వ్యాస్ ముఖ్య తారలుగా షేరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాలిని’. సాయి వెంకట్ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘హర్రర్, థ్రిల్లర్ అండ్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమిది. ౖ
టెటిల్ సాఫ్ట్‌గా ఉన్నా సినిమా మాత్రం భయపెడుతుంది. జూన్ మొదటివారంలో ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకను, రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. షేరాజ్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. నవనీత్ చారి మంచి సంగీతం అందించారు’’ అన్నారు షేరాజ్.