Punjabi Singer Alfaaz Admitted In Hospital After Attacked At Eatery In Mohali - Sakshi
Sakshi News home page

Attack On Punjabi Singer: కలకలం రేపుతున్న సింగర్‌పై హత్యాయత్నం, ఆరోగ్య పరిస్థితి విషమం

Published Mon, Oct 3 2022 12:46 PM | Last Updated on Mon, Oct 3 2022 1:18 PM

Punjabi Singer Alfaaz Injured After Being Attacked At Eatery in Mohali - Sakshi

ప్రముఖ పంజాబ్‌ సింగర్‌పై హత్యాయత్నం జరిగింది. ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలా హత్య ఘటన మరవకముందే మరో పంజాబీ సింగ్‌పై దాడి జరగడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. శనివారం రాత్రి పాపులర్ సింగర్ అల్ఫాజ్ సింగ్ అలియాస్ అమన్ జోత్ సింగ్ పన్వర్‌పై హత్యాయత్నం జరిగినట్లు పంజాబీ ర్యాపర్‌ హనీ సింగ్ సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. ఈ మేరకు అల్ఫాజ్ సింగ్ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ హనీ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో అల్ఫాజ్ సింగ్ తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ

‘శనివారం రాత్రి నా సోదరుడు అల్ఫాజ్ సింగ్ పై ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారు ఎవరైనా వారిని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి నా సోదరుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అంటూ హనీ సింగ్ పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే అతడి ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉందని చెప్పాడు. నేషనల్ మీడియా సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు సింగర్ అల్ఫాజ్ పై హత్యాయత్నానికి ప్రయత్నించి పారిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన అల్ఫాజ్ ని హాస్పిటల్ లో చేర్పించారట. అయితే.. అల్ఫాజ్ పై దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 

చదవండి: కె భాగ్యరాజ్‌కు షాక్‌, నటీనటుల సంఘం నుంచి తొలగింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement