నేనేం కొట్టలేదు : షారుఖ్ ఖాన్ | Shah Rukh Khan slapping Honey Singh is a rumour | Sakshi
Sakshi News home page

నేనేం కొట్టలేదు : షారుఖ్ ఖాన్

Published Tue, Feb 3 2015 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

నేనేం  కొట్టలేదు : షారుఖ్ ఖాన్

నేనేం కొట్టలేదు : షారుఖ్ ఖాన్

 బాలీవుడ్ పాప్‌సింగర్ హనీసింగ్‌ను కొట్టలేదని షారుఖ్ ఖాన్ తెలిపారు. తాను హనీపై చేయి చేసుకున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ‘‘కొన్ని నెలలుగా నేను హనీని కలవనేలేదు ఎందుకిలాంటి వార్తలు వస్తున్నాయో అర్థం కావట్లేదు’’అని షారుఖ్ అన్నా రు. ‘‘హనీకి అనారోగ్యంగా ఉందన్న సంగతి తెలిసింది. బాగానే గుర్తుచేశారు. వెంటనే ఫోన్ చేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు. నిజానికి, ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం షారుఖ్‌కు కొత్తేమీ కాదు. గతంలో కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ భర్త శిరీష్ కుందర్ మీద చేయిచేసుకొని, వార్తల్లో నిలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement