Nushrat Bharucha On Dating Rumours with Honey Singh - Sakshi
Sakshi News home page

Nushrratt Bharucha: హనీసింగ్‌తో డేటింగ్‌ రూమర్స్‌.. స్పందించిన హీరోయిన్‌

Published Sat, May 6 2023 4:35 PM | Last Updated on Sat, May 6 2023 5:20 PM

Nushrratt Bharucha On Dating Rumours with Honey Singh - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ నుస్రత్‌ బరూచా, ర్యాపర్‌, సింగర్‌ హనీ సింగ్‌ ఇటీవల ఓ ఈవెంట్‌లో కలిసి కనిపించారు. హనీసింగ్‌ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కాడు. ఇంకేముంది, వీరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందంటూ బీటౌన​ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ రూమర్స్‌ నుస్రత్‌ చెవిన పడ్డాయి. ఈ వార్తలు విన్న భామ ఆగ్రహమో, అసహనమో వ్యక్తం చేయకుండా ఎగిరి గంతేసినంత పని చేసింది.

నుస్రత్‌ బరూచా హిందీ ఛత్రపతి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో జోడీ కట్టింది. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు హనీసింగ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికామె స్పందిస్తూ.. 'మీకో విషయం తెలుసా, ఇది నా జీవితంలోనే ఫస్ట్‌ డేటింగ్‌ రూమర్‌. నేను పెద్దగా ఎవరితోనూ తిరగను కాబట్టి నాపై ఇంతవరకు ఎలాంటి రూమర్‌ రాలేదు.

కానీ ఈ పుకారు గురించి విన్నాక.. వావ్‌, నాకూ ఒకరు ఉన్నారన్నమాట అని సర్‌ప్రైజ్‌ అయ్యా. ఇక మీదట ఎవరడిగినా సరే, నాపై కూడా ఓ లవ్‌ రూమర్‌ ఉందని చెప్పుకోవచ్చు. అయినా జనాలకు బొత్తిగా పని లేకుండా పోయింది. ఏదేదో ఊహించుకుంటూ ఎప్పుడూ ఊహల్లోనే బతికేస్తున్నారు. సరే, నా గురించి కూడా ఏదేదో అనుకోండి, నేనేం పట్టించుకోను, నాకే సమస్యా లేదు' అని చెప్పుకొచ్చింది హీరోయిన్‌. కాగా నుస్రత్‌, హనీ సింగ్‌ 2021లో వచ్చిన ఓ మ్యూజిక్‌ వీడియోలో కనిపించారు.

చదవండి: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి, సినిమాలు వదిలేసుకున్నా: హీరో
అవే మనల్ని దూరం చేశాయి: సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement